Home సినిమా గోదారి గట్టుపైన.. చిన్న సినిమాకు ఊహించని కలెక్షన్స్! – Andhra Waves

గోదారి గట్టుపైన.. చిన్న సినిమాకు ఊహించని కలెక్షన్స్! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


ఈ వేసవిలో పెద్ద సినిమాల సందడి లేకపోయినా, చిన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది ‘గోదారి గట్టుపైన’ (Godari Gattupaina). గ్రామీణ నేపథ్యం, ​​స్వచ్ఛమైన భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఇప్పుడు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోదారి గట్టుపైన’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం, ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.3.06 కోట్ల గ్రాస్ వసూళ్లను కలిగి ఉంది. ఒక చిన్న చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమనే చెప్పాలి.

“కూలెస్ట్ సమ్మర్ ఎంటర్‌టైనర్” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులకు నిజంగానే మంచి రిలాక్సేషన్ జరుగుతోంది. ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, గోదావరి అందాలు, సహజమైన నటన ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

ప్రస్తుతం థియేటర్లలో పెద్ద పోటీ లేకపోవడం ‘గోదారి గట్టుపైన’ చిత్రం ప్లస్ పాయింట్‌గా మారింది. వీక్ డేస్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird