Home సినిమా ‘రౌడీ జనార్ధన’ బర్త్‌డే బ్లాస్ట్.. లోకాన్నే ఎదిరించే మొండితనం.. ప్రేమకు తలవంచే నైజం! – Andhra Waves

‘రౌడీ జనార్ధన’ బర్త్‌డే బ్లాస్ట్.. లోకాన్నే ఎదిరించే మొండితనం.. ప్రేమకు తలవంచే నైజం! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందజేసింది. ‘రౌడీ జనార్ధన’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదలైంది.

విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవి కిరణ్ కోల దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘రౌడీ జనార్ధన’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ నిర్మాణాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన విజయ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ కూడా వేరే లెవెల్ లో ఉంది. “A man who fights the world.. but surrenders only to love… (ప్రపంచంతో పోరాడే మనిషి… కేవలం ప్రేమకు మాత్రమే లొంగిపోతాడు) అంటూ మేకర్స్ ఈ పోస్టర్ విడుదల చేయడం విశేషం.

మాస్ లుక్‌లో విజయ్ ఊచకోత!
‘రౌడీ జనార్ధన’ పోస్టర్ లో విజయ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. వర్షంలో తడుస్తూ, పొడవటి జుట్టు, మెలితిప్పిన మీసం, చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్న విజయ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా పోస్టర్‌లో ఒక మహిళ పాదం విజయ్ గుండెలపై ఉన్న తీరు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. ఇది ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా అని పోస్టర్ డిజైన్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

‘రౌడీ జనార్ధన’ మూవీ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.

విజయ్ దేవరకొండ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ‘రౌడీ జనార్ధన’తో మళ్లీ తన సత్తా చాటుతాడని రౌడీ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird