Home Latest News పనితీరు మార్చుకోకపోతే.. ఇంకో ఛాన్స్ ఉండదు.. ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్ | పనితీరును మెరుగుపరచుకోకపోతే రెండవ అవకాశం లేదు | cbn | బలమైన | హెచ్చరిక | mlas – Andhra Waves

పనితీరు మార్చుకోకపోతే.. ఇంకో ఛాన్స్ ఉండదు.. ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్ | పనితీరును మెరుగుపరచుకోకపోతే రెండవ అవకాశం లేదు | cbn | బలమైన | హెచ్చరిక | mlas – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఇకపై ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే అడుగుతా.. ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకుంటే వారు పద్దతి మార్చుకోవాలి… లేకపోతే వారికి ఇంకో ఛాన్స్ ఉండదు. ఇదీ తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు ముఖ్మంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్త్రాంగ్ వార్నింగ్. పేదల సేవలో పాల్గొనేందుకుచంద్రబాబు శుక్రవారం (మే 1) కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నివసిస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం సీఎం చంద్రబాబు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు.

ఈ సమావేశాల సందర్భంగా ఆ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం (మే1) నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై అంతర్గత సర్వేల ద్వారా టీడీపీ అధినేత నివేదికలు తెప్పించుకుంటున్నారు. పనితీరు సరిగా లేని వారిని అప్రమత్తం చేస్తూ.. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రజా క్షేత్రంలో ఉండాలని సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు కూడా జరిగాయి. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై ఇక నుంచి నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాలు తెలుసుకోవాలని. ఎమ్మెల్యే పనితీరు గురించి ఈ రోజు నుంచి సమావేశాల్లోనే ప్రజల అడుగుతా. ప్రజలు అనుకూలంగా చేతులెత్తకపోతే ఎమ్మెల్యే తన పనితీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యేలు పనితీరును సరిదిద్దుకోకపోతే ప్రజల తరుఫున ఉంటాను.. ఎమ్మెల్యేల తరుఫున ఉండను. వారికి మళ్లీ ఛాన్స్ ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird