Home Latest News ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి | ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం | శంషాబాద్ | RR ఎగ్జిట్ 16 | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | తెలంగాణ ప్రభుత్వం | సీపీ సజ్జనార్ – Andhra Waves

ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి | ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం | శంషాబాద్ | RR ఎగ్జిట్ 16 | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | తెలంగాణ ప్రభుత్వం | సీపీ సజ్జనార్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక కార్‌లో ఏడుగురు వ్యక్తులు సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్న సమయంలో శంషాబాద్ సమీపంలోని ఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని అత్యంత వేగంగా వెనుక నుంచి ఢీ కొట్టారు.

దీంతో కారు మొత్తం ధ్వంసం అయింది. TS23F2298 గల కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు. ఢీ కొట్టిన తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులోపల ప్రయాణం ఆరుగురి వ్యక్తులు రోడ్డుమీద చెల్లా చెదురుగా పడిపోయి ప్రాణాలు కోల్పోయారు.

అది చూసిన వాహనదారులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలైన వ్యక్తిని సమీపంలోని హాస్పిటల్ కి చికిత్స. కానీ అతని విషమంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ప్రమాదంలో చెందిన ఆరు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి. ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ కునుకు పట్టడంతో ముందు ఉన్న లారీని గుర్తించలేక ఢీకొట్టినట్లుగా ఉంది. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ఘటనను చూసి చాలా కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird