సోషల్ మీడియా సెన్సేషన్, బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి (అషు రెడ్డి) చిక్కుల్లో పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక వ్యక్తి నుంచి కోట్ల రూపాయలు కాజేసినట్లు ఆమెపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో కేసు నమోదైంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.
అసలేం జరిగింది?
పోలీసుల సమాచారం ప్రకారం.. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర అనే వ్యక్తికి 2018లో అశురెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పట్లో తను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని ఆమె చెప్పింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన ఆర్థిక అవసరాల పేరుతో ఆమె ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రూ. 9.35 కోట్ల మోసం!
ధర్మేంద్ర సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు చెప్పారు. 2018 నుండి 2025 మధ్య కాలంలో అశురెడ్డి వివిధ రూపాల్లో ధర్మేంద్ర నుంచి దాదాపు రూ. 9.35 కోట్లు ఆయన తీసుకున్నట్లు. ఇందులో నగదుతో పాటు సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన లగ్జరీ కార్లు, హైదరాబాద్‌లో ఖరీదైన ఫ్లాట్లు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వీట నిలబెట్టుకున్న ధర్మేంద్ర డబ్బుతో కొనుగోలు చేసి, తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుందని బాధితుడి కుటుంబం వాగుతోంది. ఇంకా అశురెడ్డి సోదరి కూడా దాదాపు రూ. 50 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో ఉంది.
కుటుంబ సభ్యుల ప్రమేయం?
పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నామంటూ అశురెడ్డి కుటుంబ సభ్యులు కూడా తమను నమ్మించారని బాధితుడి తండ్రి తెలిపారు. అయితే తాజాగా పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అశురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు ముఖం చాటేస్తున్నారని, చివరకు తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు వారు పేర్కొన్నారు.
పోలీసు దర్యాప్తు
బాధితుడి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అశురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆస్తుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆమెకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
గతంలో డ్రగ్స్ కేసు విచారణలో పేరు వినిపించిన వార్తల్లో నిలిచిన అషురెడ్డి, ఇప్పుడు ఏకంగా రూ. 9 కోట్ల మోసం కేసులో ఇరుక్కోవడం చర్చనీయమైంది. ఈ ఆరోపణలపై అశురెడ్డి ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
