స్టార్ హీరోయిన్ సమంత (సమంత) గత రెండున్నరేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. కొన్ని కారణాల వల్ల తాత్కాలిక సినిమాలకు విరామం ప్రకటించిన సామ్, ఇప్పుడు మళ్ళీ తన పూర్వ వైభవాన్ని చాటుకునేందుకు సరికొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ‘మా ఇంటి బంగారం’ (మా ఇంటి బంగారం) సినిమాతో అలరించడానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమా టైటిల్ చూస్తుంటే ఇదొక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తున్నప్పటికీ, ఇందులో సమంత పాత్ర చాలా బలంగా ఉండబోతోందని సమాచారం. గతంలో సామ్ నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల బాటలోనే ఈ ‘మా ఇంటి బంగారం’ కూడా ఆమె నటనకు మంచి ఆస్కారం ఉన్న కథ.
తెలుగులో సమంత హిట్ కొట్టి ఏడేళ్లు అవుతుంది. 2019లో వచ్చిన ‘ఓ బేబీ’ తర్వాత ఆమె హిట్ చూడలేదు. ‘జాను’, ‘యశోద’, ‘శాకుంతలం’, ‘ఖుషి’ వంటి సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇక గత రెండున్నరేళ్లుగా సమంత నుంచి సినిమానే లేదు. మధ్యలో ‘శుభం’ సినిమాలో గెస్ట్ రోల్ తో సరిపెట్టుకున్నారు.
అలాగే, వ్యక్తిగత జీవితంలోనూ సమంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. నాగచైతన్యతో విడాకులు అయ్యాయి, అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్న సమంత.. ఇప్పుడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటాలని చూస్తున్నారు.
ఏడేళ్ల నిరీక్షణ, రెండున్నరేళ్ల విరామం తర్వాత సమంత నటిస్తున్న సోలో మూవీ కావడంతో ‘మా ఇంటి బంగారం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
గతంలో ఎన్నో విభిన్నమైన పాత్రలతో మెప్పించిన సమంత, ఈ ‘మా ఇంటి బంగారం’తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. ఈ సినిమాతో హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇస్తే మాత్రం.. సమంతకు మళ్ళీ మునుపటి క్రేజ్ వస్తుంది అనడంలో సందేహం లేదు.
