-యాంకర్ రవి సంచలన స్పీచ్
-నన్ను ఎందుకు చూడటం లేదు
-టీవీ వాళ్ళు కూడా సినిమాల్లో సత్తా చాటగలరు
-ఈ సారి కొత్త రవిని చూస్తారు
-మా కుల పెద్ద చిరంజీవి
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం
యాంకర్ గా సుదీర్ఘ కాలం నుంచి తనకంటూ ఒక ప్రత్యేకతతో దూసుకుపోతున్నాడు రవి(యాంకర్ రవి). తన వల్ల అదనపు క్రేజ్ తెచ్చుకున్న ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. అంతలా తన యాంకరింగ్ తో మెస్మరైజ్ చెయ్యగలడు. సినిమాల్లో కూడా రాణించాలని వెండి తెర అరంగ్రేటం చేసిందనే విషయం తెలిసిందే. 2017లో ‘ఇది మా ప్రేమ కథ’ అనే మూవీతో వచ్చాడు. మరి రవి రీసెంట్ గా మాట్లాడుతున్న ప్రేక్షకులు ఎందుకనో నన్ను ఆదరించడం లేదు. కానీ ఈ సారీ మాత్రం ఖచ్చితంగా ఆదరించాలి. మా కుల గురువు ఆయనే అనే క్రేజీ వ్యాఖ్యలు చేసాడు. మరి పూర్తి న్యూస్ ఏంటో చూద్దాం.
యాంకర్ రవి అప్ కమింగ్ మూవీ క్యాస్ట్(కులం).. వరుణ్ సందేశ్, సత్యం రాజేష్, గగన్ కూడా హీరోలుగా చేస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవి మాట్లాడుతు నేను యాంకర్‌గా ఎన్నో షోలు చేశాను. కానీ సినిమాల్లోకి రావాలనేది నా చిన్ననాటి కల. మీ చేత యాంకర్ రవి అనిపించుకున్న నేను ఈ మూవీతో యాక్టర్ రవి అనిపించుకోవాలని అనుకుంటున్నాను. నా ‘కులం’ సినిమా. నా కుల దేవుడు ఎన్టీఆర్. మా కుల పెద్ద మెగాస్టార్ చిరంజీవిగారు. అదొక్కటే నమ్ముకుని ముందుకు వెళ్తున్నాం. సినిమా,కెమెరా, మైక్ తప్ప ఏమీ తెలియదు నాకు. . టీవీల్లో ప్రతిరోజూ కనిపించడం వల్ల ప్రేక్షకులకి దగ్గరవుతున్నాం. కానీ అదే ఇమేజ్ సినిమాల్లో మాకు మైనస్‌గా మారుతుంది. టీవీ ఆర్టిస్ట్‌లు సినిమాలు చేస్తుంటే ఆడియన్స్ చూడటం లేదని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో టీవీ ఆర్టిస్టులని ఇండస్ట్రీలో చూసే కోణంలో కూడా మార్పు రావాలని తన ఆవేదన తెలియచేసాడు. మరి ఆ మాటలు కూడా చూద్దాం.
కూడా చదవండి: Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే స్పీడ్ తగ్గుతుందా! వరుస ఫ్లాప్స్ కారణమా!
టీవీ ఆర్టిస్టులు అనగానే చాలామంది తక్కువ చేసి చూస్తారు. మాకు టాలెంట్ ఉన్నా, వెండితెరపై మాకు దక్కాల్సిన గౌరవం, అవకాశాలు రావడం లేదు. పెద్ద తెరపై కనిపిస్తేనే ‘నటుడు’ అనే ముద్ర పడుతుందనే ధోరణి మారాలి. సినిమా నటులతో తాజా టీవీ నుండి వచ్చిన వారికి ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక యాక్టర్ ఏ మాధ్యమం ద్వారా వచ్చాడనే దానికంటే, అతను ఎంత బాగా నటించగలడు అనేదే ముఖ్యం. ప్రస్తుతం డిజిటల్ విప్లవం వల్ల ఓటీటీలు, యూట్యూబ్ స్టార్స్ కూడా సినిమాల్లోకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో టీవీ ఆర్టిస్టులని పక్కన పెట్టడం సరికాదు. క్యాస్ట్ మూవీ ద్వారా నాలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారు. నాలాంటి ఎందరో ప్రతిభావంతులకి కూడా ఒక ప్రేరణగా క్యాస్ట్ మూవీ నిలుస్తుందని నటుడు రవి చెప్పుకొచ్చాడు.

