విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది. విజయనగరం జిల్లాకు చెందిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ అమెరికాలో జలపాతంలో మునిగి మృతి చెందిన ఘటన అందరి హృదయాలను కలచి వేసింది. అక్కడ ఎమ్మెస్సీ ఉన్నత విద్య పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నించు, కష్టపడి కేవలం మూడు నెలల క్రితమే జనవరి నెలలో ఎలిసెంట్ క్లీన్ టెక్నాలజీ కంపెనీలో ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించారు.
కుటుంబానికి, గర్వకారణంగా నిలిచిన ఈ విజయంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. నిన్న సాయి శ్రీ హరికృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా కలిసి రిసార్ట్‌లో వేడుకలు జరుపుకున్నారు. అనంతరం సరదాగా ప్రకృతి సోయగాలను ఆస్వాదిం చేందుకు జలపాతం వద్దకు వెళ్లారు. అయితే అక్కడ సరదాగా స్నానం చేయ డానికి నీటిలో దిగగా ఆయ న కు ఈత రాక పోవ డం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కాసేపట్లోనే హరికృష్ణ గల్లంతయ్యాడు. అది గమనించిన మిగిలిన స్నేహితులు వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించారు, గాలింపు చర్యల అనంతరం ఆయన మృతదేహాన్ని వెలికితీశారు.
పుట్టినరోజునే ఈ దుర్ఘటన చోటుచేసుకో వడం మరింత విషాదాన్ని కలిగించింది. విదేశాల్లో జీవితం ప్రారంభించిన యువకుడు ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం వల్ల కుటుంబ సభ్యు లను ఒంటరిగా కలచివేసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఉన్నత లక్ష్యాలతో విదేశాలకు వెళ్లిన యువకుడు ఇలా అనుకోని ప్రమాదానికి గురవడం ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. యువత జలపాతాలు, నదులు వంటి ప్రమాద ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చూస్తున్నారు…. విషయం తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ యువకుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు.
