-ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే
-ఇంటి దగ్గరకి భారీగా చేరిన ఫ్యాన్స్
-అట్లీ మూవీ టైటిల్ రిలీజ్
ఏప్రిల్ 8 డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటని పాన్ ఇండియా లెవల్లో ఎవర్ని అడిగినా చెప్పే ఒకే ఒక్క మాట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్)బర్త్ డే. అంతలా తనకి మాత్రమే సాధ్యమయ్యే నాచురల్ పెర్ఫార్మ్ ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇప్పుడు వాళ్లంతా తమ అభిమాన హీరోకి బర్త్ డే విశేషాలు చెప్పడానికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న అల్లు అర్జున్ నివాసానికి భారీగా పోటెత్తారు. అల్లుఅర్జున్ వాళ్ళందర్నీ సంతోషపరుస్తూ అందరి దగ్గరకి వెళ్లి కరచాలనం చేసాడు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఉన్న ప్రెజెంట్ లుక్ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ లుక్ ఆ చిత్రం లోనిదే అని అర్ధమవుతుంది. ఇక నిమిషాల్లో అంటే 11 గంటలకి టైటిల్ రిలీజ్ కాబోతుండగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఉండకపోయే ఛాన్స్ ఉంది. రేసు గుర్రం రీ రిలీజ్ తో అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కి మూడు పండగలు వచ్చినట్టే.
ఇది కూడా చదవండి: మృణాల్ ఠాకూర్: తెలుగు సినిమా చేయనని చెప్పిన మృణాల్.. డైరెక్టర్ తో జరిగిన సంభాషణ లీక్

