Home సినిమా అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని.. నోట్ రిలీజ్ చేసిన బాలకృష్ణ – Andhra Waves

అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని.. నోట్ రిలీజ్ చేసిన బాలకృష్ణ – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo



అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించిన కేంద్రం
ఏపీ ప్రజల్లో, అమరావతి రైతుల్లో ఆనందం
బాలకృష్ణ స్పందన ఇదే

ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్(ఆంధ్రప్రదేశ్)ప్రజలందరికీ ఒక చరిత్రాత్మక విజయ క్షణం. కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారి ఆమోదంతో అమరావతిని రాజధానిగా అధికారికంగా ప్రకటించారు. ఇది మన రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకి ,భవిష్యత్తు తరాల కలలకు లభించిన న్యాయం. అమరావతి ఇప్పుడు కేవలం ఒక నగరం కాదు. మన ఆత్మగౌరవానికి, మన భవిష్యత్తుకి ప్రతీక.

ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రాజధాని చిరకాల స్వప్న సాకారానికి సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకి పార్లమెంట్ సభ్యులందరికీ, మా వెన్నంటి నిలిచిన ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. ముఖ్యంగా అమరావతి(Amaravathi)రైతుల విజయం. వారి సహనం, త్యాగం, నిబద్ధతే ఈ చరిత్రాత్మక క్షణానికి పునాది. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుంది. అమరావతి అజేయంగా, అజరామరంగా వెలుగొందుతుంది. మనందరం కలసి అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం.

జై ఆంధ్రప్రదేశ్ – జై అమరావతి మీ నందమూరి బాలకృష్ణ అని తెలిపాడు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird