Home సినిమా Patang రివ్యూ: పతంగ్ మూవీ రివ్యూ – Andhra Waves

Patang రివ్యూ: పతంగ్ మూవీ రివ్యూ – Andhra Waves

by
0 comments
Patang రివ్యూ: పతంగ్ మూవీ రివ్యూ



తారాగణం: ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీ చరణ్, అను హాసన్ తీసుకున్నారు
సంగీతం: జోస్ జిమ్మీ
డీఓపీ: శక్తి అరవింద్
ఎడిటర్: చాణక్య రెడ్డి తూర్పు
రచన, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటి
నిర్మాణం: నాని బండ్రెడ్డి ప్రొడక్షన్
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2025

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన సినిమాలలో ‘పతంగ్’ ఒకటి. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే..? (పతంగ్ మూవీ రివ్యూ)

కథ:
హైదరాబాద్ లోని బస్తీ కుర్రాడు విస్కీ అలియాస్ వంశీ కృష్ణ (వంశీ పూజిత్), సంపన్న కుటుంబానికి చెందిన అరుణ్ (ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశిస్తుంది. ఆమెది కన్ఫ్యూజింగ్ మైండ్ సెట్. ఏ విషయంలోనూ క్లారిటీగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి ఐశ్వర్య, మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అరుణ్ ని కూడా ఇష్టపడుతుంది. ఐశ్వర్య రాకతో విస్కీ, అరుణ్ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్ల ప్రాణ స్నేహితుల మధ్య విభేదాలు వచ్చాయా? చివరికి ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
తెలుగు ప్రేక్షకులకు ముక్కోణపు ప్రేమ కథలు కొత్త కాదు. ఈ తరహా కథలు ఇప్పటికే ఎన్నో చూశాము. అయితే ఎక్కువగా.. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం చూస్తుంటాం. కానీ, ఇందులో అమ్మాయే తన కన్ఫ్యూజింగ్ మైండ్ సెట్ కారణంగా ఒకేసారి ఇద్దరు అబ్బాయిలను ఇష్టపడుతుంది. అదే ఇందులో ఆసక్తికర పాయింట్.

పతంగ్ కథ చాలా చిన్నది. అయినప్పటికీ దర్శకుడు తనదైన కథనంతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. సహజమైన సన్నివేశాలతో, సున్నితమైన హాస్యంతో సినిమాని నడిపించిన తీరు అభినందనీయం. ఫస్ట్ హాఫ్ మనకు తెలియకుండానే సరదాగా నడిచిపోతుంది. విస్కీ-అరుణ్ ఫ్రెండ్ షిప్, విస్కీ-ఐశ్వర్య కథ, అరుణ్ ని కూడా ఐశ్వర్య ఇష్టపడటం వంటి ప్రేమ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ నవ్వులను పంచుతుంది.

రెండు వస్తువులు ఎదురుగా ఉంటేనే ఏది సెలెక్ట్ చేసుకోవాలని కన్‌ఫ్యూజ్ అయ్యే అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిలలో జీవిత భాగస్వామిగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది అనే ఆసక్తిని రేకెత్తిస్తూ.. కథ సెకండ్ హాఫ్‌లోకి అడుగుపెడుతుంది. సెకండ్ హాఫ్ ప్రధానంగా పతంగ్ పోటీ చుట్టూనే తిరుగుతుంది. ఈ కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తాయి. అయితే మెయిన్ పతంగ్ పోటీ మాత్రం మెప్పించింది. ముఖ్యంగా విష్ణు ఓఐ కామెంటరీ ఎపిసోడ్ కి బలంగా నిలిచింది. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి.

యూత్ ఫుల్ సినిమాలంటే ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్ లతో నిండిపోయి.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడటానికి ఇబ్బందిపడేలా ఉంటాయి. పతంగ్ మూవీ టీమ్ ఆ తప్పు చేయలేదు. కుటుంబంతో కలిసి చూసేలా ఈ సినిమాని మలిచారు. ఈ సినిమాకి మెయిన్ మైన్స్ ఏదైనా ఉందంటే.. నిడివి ఎక్కువ ఉండటమే. కనీసం 10-15 నిమిషాలు ట్రిమ్ చేసినట్లయితే.. మూవీ క్రిస్పీగా, మరింత మెరుగ్గా ఉండేది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
నటీనటులు కొత్తవారే అయినప్పటికీ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. కన్‌ఫ్యూజింగ్ మైండ్ సెట్ ఉన్న ఐశ్వర్య పాత్రలో ప్రీతి పగడాల మెప్పించింది. బస్తీ కుర్రాడిగా వంశీ పూజిత్, రిచ్ కిడ్ గా ప్రణవ్ కౌశిక్ చక్కగా రాణించారు. విష్ణు ఓఐ ఉన్నంతసేపు బాగానే నవ్వించాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీ చరణ్, అను హాసన్ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతికంగానూ పతంగ్ మెప్పించింది. జోస్ జిమ్ సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతంతో మ్యాజిక్ చేశాడు. శక్తి అరవింద్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. చాణక్య రెడ్డి ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేయొచ్చు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా..
తెలిసిన కథే అయినా.. ఫ్యామిలీతో కలిసి చూసి, కాసేపు సరదాగా నవ్వుకునేలా ఉంది ఈ ‘పతంగ్’.

రేటింగ్: 2.75/5

నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన వీక్షణలు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ సమీక్షకు వ్యాఖ్యానించడానికి లేదా ప్రతిస్పందించడానికి ముందు వీక్షకుల విచక్షణతో సలహా ఇవ్వబడుతుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird