కరీంనగర్ మేయర్ పీఠంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 సీట్లు.. 28 సీట్లతో బీజేపీ ఉంది.. అక్కడ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మెజారిటీ లేదని ప్రతిపక్షంలో కూర్చుంటామని అన్నారు. కానీ కరీంనగర్ 69 స్థానాలకు కేవలం 30 మాత్రమే ఉన్న బీజేపీకి నైతికత లేదు.
బీజేపీయేతర కార్పొరేటర్లను ఏకం చేసి మేయర్ కోసం కైవసం చేసుకుంటామని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం మేరకు ముందుకు సాగుతామని 16న స్పష్టత వస్తుందని సూచిస్తుంది. ఉత్తర తెలంగాణ లో కరీంనగర్ ను అభివృద్ధి చేయడం మా ఆలోచన.. దానికి అనుగుణంగా మంచి పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆలోచన వచ్చింది.
