ఏపీ అసెంబ్లీ సమావేశాల మూడోరోజున లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని అప్యాయంగా ఆలింగనం చేసుకుని బుచ్చయ్య తాత అంటూ ఆప్యాయంగా పలకరించారు. వారిద్దరు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులకు చూపించి ఆయన కళ్లజోడు గోల్డ్, వాచ్ గోల్డ్, రింగ్ గోల్డ్, ఫోన్ గోల్డ్, పెన్ గోల్డ్ అంటూ ఛలోక్తులు విసిరారు.
మనిషి కూడా గోల్డ్ అంటూ కితాబిచ్చారు. కానీ ఆయన వేసుకున్న షర్ట్ మాత్రం పూర్తి స్టైలిష్ షర్ట్ అని చమత్కరించారు. ఈలోపు వెనుక నుంచి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచనూ.. రాజకీయాల్లో బుచ్చయ్య గారు ఓల్డ్ అంటూ చమత్కరించారు. దీంతో లోకేశ్ పక్కనే ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముఖాల్లో నవ్వులు విరబూశాయి. ఈ లాబీల్లో కాసేపు సందడి వాతావరణం.
.webp)