ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై ఆయన సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ప్రధాని నరేంద్రమోడీ చేతిలో కీలుబొమ్మలా మారారనీ, బీజేపీని ఎదిరించే సత్తా ఆయనలో లేదనీ అన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల గురువారం (ఫిబ్రవరి 12) నెల్లూరు జిల్లాలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆమె మనుబోలు మండలం అక్కంపేటలో బహిరంగ సభలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే దమ్మూ, సత్తా జగన్ కు.
ఇక బీజేపీతో పొత్తుపెట్టుకున్నముఖ్యమంత్రి చంద్రబాబు హోదా మాటే ఎత్తడం లేదని. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్న, రాష్ట్రం బాగుపడాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు కూడా బీజేపీ బినామీలుగా మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నీరుగారుస్తోందని, పునరుద్ధరణ వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
.webp)