అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ కూ క్రికెట్ ఫీవర్ తాకింది. టి20 వరల్డ్ కప్లో ఆడుతున్న అమెరికా జట్టుకు మద్దతుగా డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. టి20 వరల్డ్ కప్ టోర్నీపై ట్రంప్ స్పందించారు. ఈ టోర్నీలో అమెరికా క్రికెట్ జట్టు బలమైన పోటీదారుని నిలబెట్టడమే కాకుండా, అమెరికా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ వేదికగా ఆయన అమెరికా జట్టుకు మద్దతు ప్రకటించారు. అమెరికా మొత్తం మీకు మద్దతుగా నిలుస్తోందనీ, టోర్నీలో సంచలనాలు నమోదు చేసే సత్తా అమెరికా క్రికెట్ జట్టుకు ఉందనీ పేర్కొన్నారు. ఈ టోర్నీలో తొలి గ్రూపులో ఉన్న అమెరికా క్రికెట్ జట్టు మ్యాచ్లో భారత్ చేతిలో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆ జట్టు సూపర్ 8 కు చేరాలంటే.. పాకిస్థాన్ తో తలపడబోయే తదుపరి మ్యాచ్ లో విజయం సాధించి తీరాలి. ఎన్నడూ లేని విధంగా డోనాల్డ్ ట్రంప్ అమెరికా జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
