ప్రజాయుద్ధ నౌక గద్దర్ కుమార్తె వెన్నెల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో బుధవారం (ఫిబ్రవరి 4) భేటీ అయ్యారు. ప్రముఖ ప్రజాగాయకుడు, విప్లవ కవి దివంగత గద్దర్ కు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని ఆమె చంద్రబాబుకు తెలిపారు.
వారి కోరిక మేరకు ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ఆమె ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ కల్చర్‌లోని తన తండ్రి గద్దర్ పేరు పెట్టాలని వెన్నెల ఈ సందర్భంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తెలుగు సాంస్కృతిక రంగానికి, ప్రజా ఉద్యమాలకు గద్దర్ చేసిన సేవను గుర్తించి ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తన విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని గద్దర్ కుమార్తె వెన్నెల తెలిపారు.
