Home Latest News వైసీపీ గ్రాఫ్ మరింత పతనం.. సీఓటర్ సర్వే ఏం చెప్పిందంటే? | పడిపోతున్న వైసీపీ గ్రాఫ్| cvoter| సర్వే| బెదిరింపు – Andhra Waves

వైసీపీ గ్రాఫ్ మరింత పతనం.. సీఓటర్ సర్వే ఏం చెప్పిందంటే? | పడిపోతున్న వైసీపీ గ్రాఫ్| cvoter| సర్వే| బెదిరింపు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి రాజకీయం అంతా బెదరింపులు, దబాయింపులేనా? అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన తీరు మారదా? యధా జగన్.. తథా వైసీపీ అన్నట్లుగా పార్టీ నేతలూ, కార్యకర్తలూ అలాగే వ్యవహరిస్తున్నారా? అంటే పరిశీలకులే కాదు, జనబాహుల్యం కూడా ఔననే అంటున్నది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల పాటు జగన్ పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు గత ఎన్నికలలో ఆయనను ఛీకొట్టారు. కేవలం 11 స్థానాలను మాత్రమే ఇచ్చి ప్రతిపక్షనేతగా జగన్ కు, ప్రతిపక్ష పార్టీగా వైసీపీకి అర్హత లేదని తమ ఓటు ద్వారా కుండబద్దలు కొట్టారు.

దీనికి ప్రధాన కారణం జగన్ పాలన, , బూతులు వినా మరో భాష తెలియదన్నట్లుగా వ్యవహరించిన ఈ పార్టీ నేతల తీరు కారణమనడంలో సందేహం లేదు. జగన్‌ హయాంలో అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై దారుణ వ్యాఖ్య‌లు చేసిన‌ందుకు సందేహం లేదు. కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు, దౌర్జన్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే, కేసులు. అయితే అంతటి ఘోర పరాజయం తరువాత కూడా జగన్ తీరు ఇసుమంతైనా మారలేదని.. ఈ పద్దెనిమిది నెలల కాలంలో తేలిపోయింది. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ బెదిరింపుల రాజకీయాలనే నమ్ముకుంది.

చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై దారుణమైన వ్యాఖ్యతో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌, పేర్ని నాని విరుచుకుపడుతున్న తీరు అదే సూచిస్తోంది. చంద్రబాబుపై బూతులతో రెచ్చిపోయి అరెస్టైన అంబటి రాంబాబుకు మద్దతుగా, ఆయన కుటుంబ సభ్యుల పరామర్శ పేర జగన్ గుంటూరు పర్యటనలో జగన్ దబాయింపులు, బెదరింపులతో రెచ్చిపోయారు. తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌తి విష‌యాన్నీ రాసి పెట్టుకుంటున్నాను.

అయితే జగన్ తీరు పట్ల, వైఖరి పట్ల ప్రజలలోనే కాదు, వైసీపీలోనే అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జగన్ ఈ ధోరణే రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ అంతకంతకూ దిగజారిపోవడానికి కారణమౌతోంది. తాజాగా ఇండియాటుడే సీఓటర్ నిర్వహించిన సర్వేలో గత ఎన్నికలలో కంటే, ఇప్పుడు జగన్ పట్ల, వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత మరింతగా పెరిగిందని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, వైసీపీకి 2024 ఎన్నికలలో వచ్చినన్ని సీట్లు, ఓట్లు వచ్చే అవకాశం ఇసుమంతైనా లేదని కుండబద్దలు కొట్టింది. గత ఎన్నికలలో 40 శాతం ఓట్లు వచ్చినట్లు చెప్పుకుంటున్న ఆ పార్టీకి ఇప్పుడు ఎన్నికలు జరిగితే చాలా తక్కువ శాతం ఓట్లు పడతాయని ఆ సర్వే. ఇప్పటికైనా జగన్ తీరు మారకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird