Home Latest News డబ్ల్యుపీఎల్ లో తొలి సెంచరీ.. బ్రంట్ రికార్డ్ | మురుగు కాలువ చరిత్ర సృష్టించింది| స్కోరింగ్| శతాబ్దం| wpl| రికార్డు – Andhra Waves

డబ్ల్యుపీఎల్ లో తొలి సెంచరీ.. బ్రంట్ రికార్డ్ | మురుగు కాలువ చరిత్ర సృష్టించింది| స్కోరింగ్| శతాబ్దం| wpl| రికార్డు – Andhra Waves

by andhra andhrawave
0 comments
డబ్ల్యుపీఎల్ లో తొలి సెంచరీ.. బ్రంట్ రికార్డ్ | మురుగు కాలువ చరిత్ర సృష్టించింది| స్కోరింగ్| శతాబ్దం| wpl| రికార్డు


పోస్ట్ చేయబడింది జనవరి 27, 2026 12:45PM


విమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే తొలి సెంచరీ చేసిన బ్యాటర్ గా నాట్ సీవర్ బ్రంట్ రికార్డు సృష్టించింది. ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్ బ్యాటర్ సీవర్ బ్రంట్ కేవలం 57 బంతుల్లోనే శతకబాది.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలి సెంచరీ బ్యాటర్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీపై సునాయాస విజయం. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయిట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకు వెళ్లింది.

కాగా ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైనా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతోంది. అయితే ఆర్సీబీకి వరుసగా ఐదు విజయాల తరువాత వరుసగా ఎదురైన రెండో ఓటమి ఇది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ సీవర్ బ్రంట్ సెంచరీ పుణ్యమా అని నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది 199 పరుగుల భారీ స్కోరు చేసింది. 200 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయింది 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్ 15 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird