జనవరి 25, 2026 11:59AMన పోస్ట్ చేయబడింది

హైదరాబాదు ఎండాబాదు నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాం భవనంలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్న పిల్లలతో పాటు ముగ్గురు పెద్దలు మృతి చెందడం విషాదంలో ముంచింది. దాదాపు 22 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం భవనంలో చిక్కుకుపోయిన ఐదుగురి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీస్ శాఖలు రంగంలోకి దిగడం, భవనం సెల్లార్ నుంచి బయటకు వస్తున్న దట్టమైన పొగలు, తీవ్ర ఉష్ణోగ్రతలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి.
లోపలికి ప్రవేశించడం సాధ్యం కాకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో తీవ్ర జాప్యం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో బేబీ (45) – మహిళ అఖిల్ (11) – బాలుడు ప్రణీత్ (8) – బాలుడు ఇంతియాజ్ (28) – పురుషుడు హబీబ్ (32) – కారు డ్రైవర్ ఈ ఐదుగురు మృతి చెందారు. ఈ అగ్నిప్రమాదం సమయంలో భవనంలో చిక్కుకుపోయిన వారిలో *బేబీ గుల్బర్గా (మహిళా వాచ్‌మెన్)*తో పాటు ఇంతియాజ్, హబీబ్, చిన్నారులు అఖిల్, ప్రణీత్ అధికారులు పేర్కొన్నారు.
రంద్రం చేసి మృతదేహాల వెలికితీత
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగలు ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది భవనం లోపల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని గుర్తించిన వెంటనే పక్క భవనం నుంచి రంధ్రానికి వెళ్లి లోపలికి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. వెలికితీసిన మృతదేహాలను వెంటనే ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేశారు. ఈ అగ్నిప్రమాదం తీవ్రతకు భవనం పూర్తిగా దెబ్బతింది.
గంటల తరబడి పొగలు, వేడి సెగలు కొనసాగుతున్నందున భవన నిర్మాణ భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవనం పరిస్థితిని పరిశీలిం చేందుకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.ప్రాథమికంగా భవనం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు, కూల్చివేత తప్పనిసరి కావొచ్చని సూచిస్తున్నారు. ఇద్దరు చిన్నారుల మృతి ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు.
అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ వివరణ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో ఫర్నీచర్ పెట్టడం వల్లనే ప్రమాదం పెరిగింది. ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని, ఫర్నీచర్‌తో పాటు కెమికల్స్‌ను కూడా సెల్లార్‌లో పెట్టడం జరిగింది. షాపు యజమాని సతీష్‌పై క్రిమినల్ కేసు నమోదు అయింది. ప్రమాదానికి షార్ట్ డీ కారణం కావచ్చాని ఫైర్జీ తెలిపారు
