Home Latest News రేగు పళ్లు అతిగా తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోండి..! | regi pallu ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు| రేగి పల్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు| రేగు పండ్ల ఉపయోగాలు – Andhra Waves

రేగు పళ్లు అతిగా తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోండి..! | regi pallu ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు| రేగి పల్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు| రేగు పండ్ల ఉపయోగాలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
రేగు పళ్లు అతిగా తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోండి..! | regi pallu ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు| రేగి పల్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు| రేగు పండ్ల ఉపయోగాలు


పోస్ట్ చేయబడింది జనవరి 19, 2026 2:08PM


సీజను బట్టి లభించే పండ్లు చాలా ఉంటాయి. అలాంటి వాటిలో రేగు పళ్లు చాలా ముఖ్యమైనవి. అయితే రేగు పళ్లను ఎవరు తిన్నా ఏం పర్వాలేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కొందరు వ్యక్తులు రేగు పళ్లను తినకూడదట. అసలు రేగు పళ్లను ఎవరు తినకూడదు? దీనికి గల కారణాలు ఏంటి? రేగు పళ్లను తినడం వల్ల ఎవరికి సమస్యలు ఉంటాయి? వివరంగా తెలుసుకుంటే..

సీజన్ ను బట్టి వివిధ రకాల పండ్లు అందుబాటులోకి వస్తుంటాయి. ఆరోగ్యం బాగుండాలంటే సీజ‌న్‌లో దొరికే పండ్లు మంచిదని అంటుంటారు వైద్యులు, పెద్దలు. వాతావరణం లభించేవి రేగు పళ్లు. చాలామంది రేగుపళ్లను చాలా ఉత్సాహంగా తింటారు. అన్ని చిన్నతనంతో ముడిపడిన ఆనందాలు.

కొంతమందికి మాత్రం రేగు పళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది.

ఎవరు తినకూడదంటే..

మధుమేహం ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండాలి. బాగా పండిన రేగు పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతాయి.

కేవలం చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండటమే కాకుండా వాటిలో కార్బోహెడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా రేగు పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.

రేగు పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి మొదలైన సమస్యలు ఉన్నవారు రేగు పండ్లను తింటే సమస్య మరింత పెరుగుతుంది.

గర్బిణీ స్త్రీలు రేగు పండ్లకు దూరంగా ఉండాలి. రేగు పండ్లు తినడం వల్ల వారికి కడుపులో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మలబద్దకం లాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి.

కొంతమందికి రేగు పండ్లు తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. అలర్జీ ఉన్నవారు రేగు పండ్లకు సమస్యలు దూరంగా ఉండటం మంచిది.

*రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించబడ్డాయి. వారి ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు…



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird