Home Latest News ఆ కోడిపుంజు నిలువెల్లా బంగారమే! | బంగారు కోడి| భీమవరం| కోడిపందాలు| ప్రత్యేక – Andhra Waves

ఆ కోడిపుంజు నిలువెల్లా బంగారమే! | బంగారు కోడి| భీమవరం| కోడిపందాలు| ప్రత్యేక – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఆ కోడిపుంజు నిలువెల్లా బంగారమే! | బంగారు కోడి| భీమవరం| కోడిపందాలు| ప్రత్యేక


జనవరి 18, 2026 10:07PMన పోస్ట్ చేయబడింది


వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అన్నది సామెత. ఇప్పుడా సామెతకు చూస్తే భీమవరం కోడిపుంజునే చూడాలి అని చేర్చుకోవాలి. ఎందుకంటే భీమవరంలో ఓ కోడి పుంజుకు దాని యజమాని పులిగోరు సహా బంగారు నగలు చేయించారు. ఇప్పుడు అక్కడ బంగారుంతా కోడి పుంజు వచ్చేనండీ అంటూ పాడుకుంటున్నారు.

ఔను ఆ కోడి పుంజు బంగారు ఆభరణాలు, పులి గోరుతో దర్జా ఒలకపోస్తోంది .భీమవరం దుర్గాపురంలో జరిగిన కోడిపందాలలో నిలువెల్లా బంగారం ధరించిన కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పుంజు యజమాని తన కోడిపుంజును 15 కాసుల బంగారు గొలుసు, పులిగోరుతో ప్రత్యేకంగా అలంకరించాడు.

ఆ కోడి పుంజుపై ఉన్న నగల విలువ 50 లక్షల రూపాయాలకు పైనే ఉంటుందని అంచనా. జీడిపప్పు బాదం, పిస్తా వంటి శక్తివంతమైన ఆహారంతో మేపి మరీ పందేలకు సిద్దమైన ఆ కోడి పుంజు కాలికి కోడికత్తి కట్టుకొని పందెంలో దిగి ఘనవిజయాన్ని సాధించింది. ఈ ప్రత్యేక బంగారు పులిగోరు కోడిని చూచేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోడి పందేల కు మించి ఈ కోడి పుంజే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird