పోస్ట్ చేయబడింది జనవరి 16, 2026 2:23PM

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటిరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇక అదనపు విచారణ అవసరం లేదు. ఇంకెంతకాలం విచారణ కొనసాగుతుందని సిట్‌ను ప్రశ్నించారు. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. స్పందించిన న్యాయమూర్తి నాగరత్న“ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేము కదా? మీ ఉద్దేశం పూర్తయిందా లేదా? ప్రభాకర్‌రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని ధర్మాసనం, ప్రభుత్వ వాదనలను తీసుకోవాలని తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.
.webp)