
మెగా అభిమానులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(మన శంకర వర ప్రసాద్ గారు) మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మెగా అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఈ ఆనందకర సమయంలో ఓ విషాదం చోటుచేసుకుంది. సినిమా చూస్తూ మెగా అభిమాని కన్నుమూశాడు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూస్తున్న సమయంలో ఓ అభిమాని అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్లుగా. సంతోషంగా సినిమా చూసిన తోటి అభిమాని ఇలా అకస్మాత్తుగా మరణించడంతో మెగా అభిమానుల్లో విషాదం.
ఇది కూడా చదవండి: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ
