పోస్ట్ చేయబడింది జనవరి 11, 2026 3:12PM

రాజధాని అమరావతిపై మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. కేంద్రం, రాష్ట్రంతో పాటు అందరం కలిసి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో మాజీ రాష్ట్రపతి. అమరావతి అంటే గుంటూరు, గన్నవరం, విజయవాడ, తాడికొండలు మాత్రమే కాదు…ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతి రూపం అన్నారు. రాజధాని విషయంలో సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు. ఈ విషయంలో అనవసరమైన వివాదాలను సృష్టించాడు.
పాలిటిక్స్‌లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదు. అందుకే రాజకీయాల్లోకి తన కొడుకు, కుమార్తెను రానివ్వలేదని స్పష్టం చేశారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని తన పిల్లలకు చెప్పానని, అదే తాను ఇచ్చే సంపద అని వెంకయ్య నాయుడు అన్నారు. ఏది మారినా మన సంస్కృతి సంప్రదాయాలు మూలాలు మారకూడదని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇంటికి చేరే సమయంలో సంక్రాంతి పండగ నిర్వహిస్తామని, ఈ మధ్య వాతవరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రకృతి మన పండగలన్నీ ముడిపడి ఉన్నాయి. ప్రకృతి బాగుంటేనే భవిష్యత్ కూడా బాగుంటుందని వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో అమరావతి కూడా అభివృద్ధి చెందాలని అన్నారు.
.webp)