Home Latest News బళ్లారి కాల్పుల వివాదం…ఎస్పీ ఆత్మహత్యాయత్నం | బళ్లారి కాల్పుల వివాదం| ఎస్పీ పవన్ నిజ్జూర్| బళ్లారి| కర్ణాటక రాష్ట్రం| MLA గాలి జనార్ధన్ రెడ్డి|MLA Nara Bharat Reddy| కాంగ్రెస్ కార్యకర్త| సీఎం సిద్దరామయ్య| డిప్యూటీ సీఎం శివకుమార్ – Andhra Waves

బళ్లారి కాల్పుల వివాదం…ఎస్పీ ఆత్మహత్యాయత్నం | బళ్లారి కాల్పుల వివాదం| ఎస్పీ పవన్ నిజ్జూర్| బళ్లారి| కర్ణాటక రాష్ట్రం| MLA గాలి జనార్ధన్ రెడ్డి|MLA Nara Bharat Reddy| కాంగ్రెస్ కార్యకర్త| సీఎం సిద్దరామయ్య| డిప్యూటీ సీఎం శివకుమార్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
బళ్లారి కాల్పుల వివాదం...ఎస్పీ ఆత్మహత్యాయత్నం | బళ్లారి కాల్పుల వివాదం| ఎస్పీ పవన్ నిజ్జూర్| బళ్లారి| కర్ణాటక రాష్ట్రం| MLA గాలి జనార్ధన్ రెడ్డి|MLA Nara Bharat Reddy| కాంగ్రెస్ కార్యకర్త| సీఎం సిద్దరామయ్య| డిప్యూటీ సీఎం శివకుమార్


పోస్ట్ చేయబడింది జనవరి 3, 2026 2:57PM


కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసి కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్యుడిని చేస్తూ బళ్లారి ఎస్పీని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో మనస్తాపానికి గురై ఎస్పీ తుమకూరు జిల్లా శిరా తాలూకాలోని తన హౌస్‌లో నిద్రమాత్రలు మింగి ఆయనకు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం.


బళ్లారిలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎమ్మెల్యే వర్గీయులు జనవరి 1, 2026న ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఘర్షణ పడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి , బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఈ ముదిరి రాళ్లు రువ్వుకోవడం, చివరకు కాల్పుల వరకు దారితీసింది. ఈ కాల్పుల్లో రాజశేఖర్ రెడ్డి అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడంతో బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ కాల్పుల ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు తదితరులపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇరువర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 40 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. బళ్లారిలో హై టెన్షన్ మొదలైంది



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird