జనవరి 1, 2026 10:19PMన పోస్ట్ చేయబడింది

తోటి విద్యార్థులతో పందెం కాసి పెన్ను మింగేసిన విద్యార్థి ఉదంతమైంది. అలా పెన్ను మింగేసిన మూడేళ్ల తరువాత తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రి పాలయ్యాడు. స్కానింగ్ లో కడుపులో పెన్ను ఉందని గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా పెన్ను బయటకు తీసి అతడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే..
గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు, లక్ష్మీ సుజాతల కుమారుడు మురళీకృష్ణ (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడేళ్ల కిందట అంటే అతడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. తోడు పందెం కాసి పెన్ను మింగేశాడు. ఆ విషయం ఇంట్లో చెప్పలేదు. ఈ మూడేళ్లుగా తరచుగా కడుపునొప్పి వస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు.
అయితే తాజాగా గత నెల 18న తీవ్రమైన కడుపునొప్పితో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు సర్వ జనాస్పత్రికి తీసుకెళ్లారు, అక్కడ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించి పెన్ను ప్రకటించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే పెన్నును బయటకు తీసి అతడి ప్రాణాలు కాపాడారు.
