
-బాలీవుడ్ ని సేవ్ చేసిందా!
-కలెక్షన్స్ ఎంత
-పూర్తి రన్నింగ్ లో ఎంత వస్తాయి
వరుస పరాజయాలతో కథల ఎంపికపై, మేకింగ్ పై విమర్శలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ సినీ ముఖ చిత్రాన్నే మార్చివేసిన చిత్రం’ధురంధర్'(ధురంధర్). ముఖాన్ని మార్చడమే కాదు ఒక కొత్త ఊపిరిని కూడా ఇచ్చింది. దీనితో బాలీవుడ్ తన పూర్వ వైభవం గురించి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ధురంధర్ ఘన విజయంతో మేకర్స్, హీరోలు సరికొత్త కథలకి అంకురార్పణ చేయడం ఖాయం. దీని వల్ల భారతీయ సినీ ప్రేమికులకి సినీ వినోదం లభించడం పక్కా.
ఇక సిల్వర్ స్క్రీన్ పై ధురంధర్ తన ప్రభావం యధావిధిగా కొనసాగిస్తు రీసెంట్ గా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. మేకర్స్ ఈ మేరకు అధికారకంగా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో 1006 .7 కోట్ల గ్రాస్ ని రాబట్టిందని, ఇండియాలో 789 .18 కోట్లు, ఓవర్ సీస్ లో 217 .50 కోట్లు వసూలు చేసినట్లు కూడా చెప్పారు. డిసెంబర్ 5 న రిలీజైన ధురంధర్ రిలీజైన ఇరవై రెండు రోజులకే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిందంటే రన్నింగ్‌లో ఎన్ని కలెక్షన్స్ వసూలు చేస్తుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. బాలీవుడ్ లో ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం కూడా ధురంధర్ నే.
ఇది కూడా చదవండి: రవితేజ పై తేజ సజ్జ వ్యాఖ్యలు.. మన విలువ తెలియడం పక్కా
.

