Home Latest News ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి విందు…30 వేల మంది ఉన్నారు | ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్| మధ్యప్రదేశ్| సాంచి ఎమ్మెల్యే| పర్వ్ చౌదరి| భోపాల్| జ్యోతిరాదిత్య సింధియా| శివరాజ్ సింగ్ చౌహాన్ – Andhra Waves

ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి విందు…30 వేల మంది ఉన్నారు | ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్| మధ్యప్రదేశ్| సాంచి ఎమ్మెల్యే| పర్వ్ చౌదరి| భోపాల్| జ్యోతిరాదిత్య సింధియా| శివరాజ్ సింగ్ చౌహాన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి విందు...30 వేల మంది ఉన్నారు | ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్| మధ్యప్రదేశ్| సాంచి ఎమ్మెల్యే| పర్వ్ చౌదరి| భోపాల్| జ్యోతిరాదిత్య సింధియా| శివరాజ్ సింగ్ చౌహాన్


డిసెంబర్ 23, 2025 4:05PMన పోస్ట్ చేయబడింది


మధ్యప్రదేశ్ సాంచీ ఎమ్మెల్యే ప్రభు రామ్ చౌదరీ తన కొడుకు పెళ్లి విందు అత్యంత వైభవంగా నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు పర్వ్ చౌదరీ వివాహం ఇటీవల జరిగింది. దానిని భోపాల్‌లో సింపుల్‌గా జరిగింది. రిసెప్షన్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అందుకోసం రాయ్‌సెన్‌లో ఎనిమిది ఎకరాల్లో వేదిక వేశారు. వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 30 వేల మంది హాజరు. 1000 మంది వంటవాళ్లు దేశీ, విదేశీ వంటకాలను సిద్ధం చేశారు.

రాజస్థాన్‌ నుంచి కళాకారులు.. సంప్రదాయ సంగీతాన్ని వినిపించారు. రాయ్‌సెన్‌లో ఈ స్థాయి వేడుక ఎన్నడూ జరగలేదని స్థానికులు. అయితే ఈ వ్యయంతో ఒక చిన్నపాటి ప్రాజెక్ట్ నిర్మించివుండాలని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు సీఎం మోహన్ యాదవ్ చిన్న కుమారుడు డాక్టర్ అభిమన్యు పెళ్లి సాధారణంగా జరిగింది. ఉజ్జయినిలో పెళ్లి చేసుకున్నారు.

బాబా రామ్‌దేవ్ మంత్రాలు చదువుతుండగా.. పూల దండలు మార్చుకుని.. చాలా సింపుల్‌గా ఈ తతంగాన్ని ముగించారు. వీరితో పాటు మరో 21 జంటలు ఇదే ముహూర్తంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఎలాంటి కానుకలు, హంగూ, ఆర్భాటాలు లేకుండా ఈ తంతు ముగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎమ్మెల్యే పెళ్లి విందులో కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్‌ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎం జగదీశ్‌ దేవ్డా, మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ఇతర సీనియర్ నేతలు వేడుకల్లో ఉన్నారు



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird