Home Latest News అనాధ బాలల నైపుణ్యాభివృద్దికి సహకారం : ఎంఐఎల్ ఫౌండేషన్ | డైరెక్టర్ ఎంఈఐఎల్ సుధా రెడ్డి| MNJ క్యాన్సర్ హాస్పిటల్| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

అనాధ బాలల నైపుణ్యాభివృద్దికి సహకారం : ఎంఐఎల్ ఫౌండేషన్ | డైరెక్టర్ ఎంఈఐఎల్ సుధా రెడ్డి| MNJ క్యాన్సర్ హాస్పిటల్| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
అనాధ బాలల నైపుణ్యాభివృద్దికి సహకారం : ఎంఐఎల్ ఫౌండేషన్ | డైరెక్టర్ ఎంఈఐఎల్ సుధా రెడ్డి| MNJ క్యాన్సర్ హాస్పిటల్| సీఎం రేవంత్ రెడ్డి


డిసెంబర్ 17, 2025 8:43PMన పోస్ట్ చేయబడింది


అనాధ బాలల్లో నైపుణ్యాభివృద్దితో పాటు, ఎంఎన్ జె కాన్సర్ ఆసుపత్రి అభివృద్దికి సంపూర్ణ సహకారం అందజేస్తుంది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) డైరెక్టర్ సుధా రెడ్డి అన్నారు. తమ సంస్థ పది సంవత్సరాల నుంచి యువతలో నైపుణ్యాలను పెంచి వారు సొంత కాళ్లపై నిలబడేలా శిక్షణ ఇస్తున్నారని, అనాధ బాలలు కూడా అలా తమ కాళ్లపై తాము నిలబడేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ బ్లాక్ ను ఎలా అయితే అభివృద్ధి చేశామో అలానే ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేసింది.

ముందుగా ఇక్కడి వైద్యులతో మాట్లాడి ఏమి అవసరమో తెలుసుకుని ఆ అవసరాలను తీరుస్తామన్నారు. ఎం ఈ ఐ ఎల్, ఎస్ ఆర్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో బుధవారం పలు ప్రాంతాల్లో అనాధలకు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్న బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఎమ్ ఎన్ జె కాన్సర్ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు బ్లాంకెట్స్, పండ్లు, , మూసాపేటలోని సాయి సేవా సంఘంలో విద్యను అభ్యసించే వారికి బ్లాంకెట్లను సుధా రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో, ఆ తరువాత విలేకరులతో సుధా రెడ్డి మాట్లాడారు. సాయి సేవా సంఘ్ విద్యా మందిర్ లో ఆనాధలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు విద్యనభ్యసిస్తున్నారు. వారు పదో తరగతి లేదా ఆ పై చదువుల తరువాత తమ కాళ్లపై తాము నిలబడి స్వశక్తితో జీవించేందుకు తమ సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తోంది.

ఈ సంస్థ కొన్ని వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తోందని, వాటికి అదనంగా తమ సంస్థకు అదనపు కోర్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్నితో గడపడం వల్ల వచ్చే సంతోషం వేరే పిల్లల కార్యక్రమాల వల్ల తనకు రాదన్నారు. అందుకే తాను చిన్న పిల్లల కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తనకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తి అని అన్నారు. తానూ చిన్నగా ఉన్నపుడు కొన్ని అంశాలను ఆమె ద్వారా స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు.

చిన్నపుడు తీసుకునే సరైన నిర్ణయాలు అందరి జీవితాలను ఒక తిప్పుతాను కాబట్టి సరైన ప్రతి ఒక్కరు చిన్న వయస్సులో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు చలికాలంలో ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందుల నుంచి బైట పడేసేందుకు తమ ఫౌండేషన్ల నుంచి సాయం అందిస్తామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, దీన్ని విస్తరిస్తామని తెలిపారు

చలికాలంలో అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు. ఎంఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ముద్దాడిన సుధా రెడ్డి వారికి బ్లాంకెట్స్, పండ్లు పంపిణీ చేశారు. తాము అక్షయ పాత్ర ద్వారా క్యాన్సర్ రోగులకు కొన్ని సంవత్సరాల నుండి ఆహారం పంపిణీ చేస్తాము. తమ కార్యక్రమాలను మరింత విస్తృత పరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సాయి సేవా సంఘ ప్రతినిధులు, ఎంఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు ఉన్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird