Home Latest News మన్యంలో మావోయిస్టు బ్యానర్ల కలకలం | ఏపీ మన్యంలో మావోయిస్టుల బ్యానర్లు| నివాళులు| హిద్మా| సృష్టించు – Andhra Waves

మన్యంలో మావోయిస్టు బ్యానర్ల కలకలం | ఏపీ మన్యంలో మావోయిస్టుల బ్యానర్లు| నివాళులు| హిద్మా| సృష్టించు – Andhra Waves

by andhra andhrawave
0 comments
మన్యంలో మావోయిస్టు బ్యానర్ల కలకలం | ఏపీ మన్యంలో మావోయిస్టుల బ్యానర్లు| నివాళులు| హిద్మా| సృష్టించు


డిసెంబర్ 10, 2025 1:33PMన పోస్ట్ చేయబడింది


ఆపరేషన్ కగర్ తో మావోయిస్టు పార్టీ కకావికలమైపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాట పట్టారు. సాయుధ పోరాటాన్ని విఫల ప్రయోగంగా అభివర్ణించారు. ఇంకా చాలా మంది మావోలు, కేంద్ర కమిటీ నాయకులు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. ఇకముందు.. మావోయిస్టు పార్టీ పనైపోయిందన్న చర్చలూ పెద్ద ఎత్తున సాగాయి. సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టుల పోస్టర్లు, బ్యానర్లు ఆంధ్రప్రదేశ్ మన్యంలో సంచలనం రేపాయి. మావోయిస్టుల సంచారం పెద్దగా కనిపించని అల్లూరి మన్యంలో ఇటీవల ఎన్ కౌంటర్ లో హతమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ మావోయిస్టులు బ్యానర్లు ఏర్పాటు చేశారు.

ముంచంగిపుట్టు మండలం కుమ్మిపుట్టు గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన చెట్టుకు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ బ్యానర్లు దర్శనమిచ్చాయి. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నందున ఇప్పుడు ఏజెన్సీలో మావోయిస్టుల బ్యానర్లు సంచలనం సృష్టించాయి.

ఆయుధాలను విడిచే ప్రశ్నే లేదనీ, లొంగుబాటుకు మావోయిస్టులు ప్రభుత్వాలతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదనీ ఇటీవల మావోయిస్టు అగ్రనేత వికల్ప్ ప్రాధాన్యత పేర లేఖ విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు ఈ బ్యానర్లు వెలియడం సంతరించుకుంది. మావోయిస్టులు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నారన్న అనుమానాలకు ఈ బ్యానర్లు తావిచ్చాయి.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird