Home Latest News జాతీయ మీడియా టార్గెట్ కేంద్ర కేబినెట్ లోని దక్షిణాది మంత్రులేనా? | కేంద్ర కేబినెట్‌లో దక్షిణాది మంత్రులపై నేషనల్ మీడియా టార్గెట్| నీలిమందు| సంక్షోభం| విమర్శించండి| పౌర – Andhra Waves

జాతీయ మీడియా టార్గెట్ కేంద్ర కేబినెట్ లోని దక్షిణాది మంత్రులేనా? | కేంద్ర కేబినెట్‌లో దక్షిణాది మంత్రులపై నేషనల్ మీడియా టార్గెట్| నీలిమందు| సంక్షోభం| విమర్శించండి| పౌర – Andhra Waves

by andhra andhrawave
0 comments
జాతీయ మీడియా టార్గెట్ కేంద్ర కేబినెట్ లోని దక్షిణాది మంత్రులేనా? | కేంద్ర కేబినెట్‌లో దక్షిణాది మంత్రులపై నేషనల్ మీడియా టార్గెట్| నీలిమందు| సంక్షోభం| విమర్శించండి| పౌర


డిసెంబర్ 10, 2025 9:23AMన పోస్ట్ చేయబడింది


కేంద్ర మంత్రత్వ శాఖలన్నిటిలోనూ అత్యంత రిస్కీ శాఖ అంటూ ఏదైనా ఉందంటే అది పౌర విమానయాన శాఖ మాత్రమే. ఇటీవలి కాలంలో ఈ శాఖను ఎన్డీయే కూటమి సర్కార్ తెలుగువారికే అప్పగిస్తోంది. అది కూడా భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం కే ఈ శాఖ కేటాయిస్తోంది. గతంలో అంటే 2014-19లో ఎన్డీయే కూటమి తన భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఎంపీ అయిన అశోక్ గజపతి రాజుకు ఈ శాఖ కట్టబెట్టింది. ఇప్పుడు 2024లో మళ్లీ ఈ శాఖను తెలుగుదేశం యువ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడికి అప్పగించారు. వాస్తవానికి పౌర విమానయాన శాఖ అత్యంత క్లిష్టమైనది, అత్యంత కీలకమైనది కూడా. ప్రమాదాలు, వివాదాలు సాంకేతిక లోపాలు స్థిర విమానయానాల్లో సహజం. ఎక్కడా విమాన ప్రమాదం జరిగినా, సాంకేతిక లోపంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా, దేశంలో సాంకేతిక లోపం తలెత్తినా పౌర విమానయాన శాఖ మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా చేస్తున్నారు. విన్నూత్న ఆలోచనలతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేసేందుకు, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. శాఖాపరమైన పనులు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా జరిగేలా చూస్తున్నారు. అందరూ ఆయన పని తీరును భేష్ అంటూ ప్రశంసిస్తున్నారు.

అడలా ఉంటే.. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు, విమానాలలో సాంకేతిక లోపాల వంటి కారణాలు పౌరవిమాన శాఖకు తలనొప్పిగా పరిణమించాయి. తాజాగా ఇండిగో వ్య వహారం మరో పెద్ద సమస్యగా పరిణమించింది. డీజీసీఏ నిబంధనలు పైలట్లకు విశ్రాంతి కోసం ఏర్పాటు చేస్తే.. అవి కాస్తా ఆ శాఖా మంత్రి అయిన రామ్మోహన్ నాయుడుకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెండ్ ఛాయడం కోసం జాతీయ మీడియా పౌర విమానయాన సంస్థ మంత్రిని స్కెప్ గాట్ గా మార్చే ప్రయత్నం చేస్తోంది. జాతీయ మీడియా ఉద్దేశపూర్వకంగా దక్షిణాది మంత్రులపై దాడి చేస్తున్నా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు విశ్లేషకులు. ఇండిగో ప్రణాళికా లోపం, నిర్వహణ వైఫల్యం కారణంగా ఆ సంస్థకు చెందిన విమాన సర్వీసులు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనికి బాధ్యత వహించాల్సింది పూర్తిగా ఇండిగో సంస్థ. ఇప్పటికే ఆ సంస్థపై చర్యలకు మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉపక్రమించారు. సుప్రీం కోర్టు కూడా చర్యలను సమర్థించి, ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. అయినా జాతీయ మీడియా మాత్రం ఇండిగో సంక్షోభాన్ని పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నించింది.

ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే జాతీయ మీడియావాటికి ఆ శాఖ మంత్రిని బాధ్యుడిని చేస్తూ కథనాలు వండి వార్చలేదు. ఇప్పుడు ఇండిగో వ్యవహారంలో మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యత వహించాలంటూ గగ్గోలు పెడుతోంది. జాతీయ మీడియా ఉత్తరాది, దక్షిణాది వివక్ష చూపుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird