Home సినిమా పవన్ కళ్యాణ్.. అభినవ కృష్ణ దేవరాయ… – Andhra Waves

పవన్ కళ్యాణ్.. అభినవ కృష్ణ దేవరాయ… – Andhra Waves

by
0 comments
పవన్ కళ్యాణ్.. అభినవ కృష్ణ దేవరాయ...



సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్). సినీ రంగంలో పవర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న పవన్.. రాజకీయ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఓ అరుదైన గౌరవం దక్కింది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే గొప్ప బిరుదు లభించింది. కర్ణాటక రాష్ట్రం ఉడుపిలోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ.. ఆయనకు ఈ బిరుదుని ప్రదానం చేశారు.

ఇది కూడా చదవండి: ఓటీటీలోకి కాంత.. రిజల్ట్ రివర్స్ అవుతుందా..?

ఆదివారం సాయంత్రం ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు ప్రదానం చేశారు.

‘బృహత్ గీతోత్సవ’లో పవన్ మాట్లాడుతూ.. భగవద్గీత గొప్పతనాన్ని వివరించారు. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు.. భగవద్గీత మనో ధైర్యమిచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి. భగవద్గీత ఒకసారి చదివి ఎర్ర వస్త్రంతో కప్పి పూజ గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మనల్ని నడిపించే జ్ఞానం భగవద్గీత అని తెలుస్తుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird