Home Latest News పుతిన్, జిన్ పింగ్, మోడీ…వీరి మధ్య పోలికేంటి!? | పుతిన్ మరియు మోడీ మధ్య సారూప్యతలు| వ్లాదిమిర్ పుతిన్| జిన్ పింగ్| PM MODI| పుతిన్ భారత పర్యటన| రష్యా భారతదేశ సంబంధాలు|చైనా వ్యాఖ్యలు| అమెరికా అధ్యక్షుడు – Andhra Waves

పుతిన్, జిన్ పింగ్, మోడీ…వీరి మధ్య పోలికేంటి!? | పుతిన్ మరియు మోడీ మధ్య సారూప్యతలు| వ్లాదిమిర్ పుతిన్| జిన్ పింగ్| PM MODI| పుతిన్ భారత పర్యటన| రష్యా భారతదేశ సంబంధాలు|చైనా వ్యాఖ్యలు| అమెరికా అధ్యక్షుడు – Andhra Waves

by andhra andhrawave
0 comments
పుతిన్, జిన్ పింగ్, మోడీ...వీరి మధ్య పోలికేంటి!? | పుతిన్ మరియు మోడీ మధ్య సారూప్యతలు| వ్లాదిమిర్ పుతిన్| జిన్ పింగ్| PM MODI| పుతిన్ భారత పర్యటన| రష్యా భారతదేశ సంబంధాలు|చైనా వ్యాఖ్యలు| అమెరికా అధ్యక్షుడు


డిసెంబర్ 5, 2025 5:02PMన పోస్ట్ చేయబడింది


ప్ర‌పంచంలోనే ప్ర‌స్తుతం సుదీర్ఘ కాలంగా ఒక దేశాన్ని ఏలుతున్న ప‌వ‌ర్ఫుల్ లీడ‌ర్స్ లో పుతిన్ అగ్ర స్థానంలో నిలిచారు. ఆయన గత పాతికేళ్లుగా రష్యన్ అధ్యక్ష హోదాలో ప‌రిపాలిస్తున్నారు.1999 చివర్లో తాత్కాలిక అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన పుతిన్, 2000 నుండి 2008 వరకు, 2012 నుండి ఇప్పటి వరకు ఆయనే ఆ దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు, 2020 రాజ్యాంగ సవరణలతో 2036 వరకు పదవిలో ఉండేందుకు వీలు కల్పించారు. దీని ప్రకారం సుమారు 36, 37 ఏళ్ల పాటు పుతిన్ రష్యాను పాలించిన రికార్డు క్రియేట్ చేయనున్నారు.

ఇక అత్యధిక కాలం అతి పెద్ద దేశాన్ని పాలించిన వారెవ‌ర‌ని చూస్తే వారిలో జిన్ పింగ్ త‌ర్వాతి స్థానంలో ఉన్నారు. జిన్‌పింగ్ 2012 నుండి చైనాకు అధ్య క్షుడిగా ప ని చేస్తున్నారు, 2013లో ఆయ‌న అధ్యక్షుడయ్యారు. 2018లో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాల పరిమితిని తొలగించారు, దీంతో ఆయన జీవితకాలం పాటు పాలించే అవకాశం ఉంది, ఆయన ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవ‌ల జిన్ పింగ్ కొంత కాలం క‌నిపించ‌క పోయే స‌రికి ఆ త‌ర్వాతి అధ్య‌క్షుడెవ‌ర‌న్న చ‌ర్చ న‌డిచింది.

ఇక మోడీ సంగ‌తి చూస్తే వీరిక‌న్నా కాస్త లేటుగా భార‌త‌దేశ ప్ర‌ధాని బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌గా.. ప్ర‌స్తుతం మూడో మారు ప్ర‌ధాన మంత్రిగా ఎన్నిక‌ై.. నాన్ స్టాప్‌గా భారత దేశాన్ని ఏలుతున్నారు. పుతిన్, జిన్ పింగ్, మోడీకి దగ్గ‌ర పోలిక ఏంటంటే అప్ర‌తిహ‌తంగా ఎక్క‌డా త‌మ పాల‌నాకాలాన్ని బ్రేక్ చేసుకోకుండా ప‌ని చేస్తూ రావ‌డం. అయితే పుతిన్, జిన్ పింగ్ కి ఉన్న వెస‌లుబాటు మోడీకి లేక పోవ‌డం మైన‌స్. ఇక్క‌డ సుదీర్ఘ అధ్య‌క్ష పాల‌న అంటూ ఉండ‌దు. అప్ప‌టికే మోడీ ప్రాతినిథ్యం వ‌హించే బీజేపీకి.. 75 ఏళ్ల వ‌యో ప‌రిమితి కూడా ఉంది. అయితే మోడీ విష‌యంలో ఈ నిబంధ‌న‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన‌ట్టు సూచిస్తుంది సంఘ్ ప‌రివార్.

భారత్ కి మల్లె రహస్య చైనాల్లో ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌లున్నా.. అవి అధ్య‌క్ష పీఠాన్ని క‌దిల్చే ప‌రిస్థితి ఉండ‌దు. ఒక్కసారి రాజ్యాంగ ప‌ర‌మైన మార్పు చేస్తే ఇక ఆయా అధ్య‌క్షులు లైఫ్ లాంగ్ ఉండ‌గ‌ల‌రు. అదే భారత్ అమెరికాలలో అలాకాదు.. ఇక్క‌డ ప్ర‌తి నాలుగైదెళ్ల‌కు ఎన్నిక‌లుంటాయి. దీనితో ఈ రెండు దేశాల్లో గెలుపోటములు ప్ర‌భావితం అవుతాయి వీరి పాల‌నా కాలాల‌ను.

ట్రంప్ కి కూడా నాన్ స్టాప్ గా అమెరికా అధ్య క్షుడిగా ఉండాల‌న్న కోరిక ఉంటుంది కానీ, అక్క‌డి రాజ్యాంగం అందుకు అనుమ‌తించ‌దు. ఇక మోడీ ఇక్క‌డ కూడా స‌రిగ్గా జ‌మిలీ ఎన్నిక‌లు, అధ్య‌క్ష పాల‌న ఏర్పాటు తీసుకురావాల‌ని చూస్తున్నారు. కానీ భిన్నత్వంలో ఏక’త్వంతో కూడుకున్న భార‌త దేశంలో అలాంటి మార్పుల‌కు అవ‌కాశ‌ముందా? అంటే చాలా కష్టతరంగా చెప్పాల్సి ఉంటుంది. అప్ప‌టికీ మోడీ మూడోమారు కూడా ప్ర‌ధానికావడం ప‌ట్ల ప్ర‌తిప‌క్ష పార్టీలో ఈసీని నిర్వ‌హిస్తున్న‌ర‌న్న కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఫైనల్ గా ఒక మాట ఏంటంటే సుదీర్ఘంగా అధ్యక్ష స్థానంలో ఉండే పుతిన్, జిన్ పింగ్, మోడీ వంటి వారికి ఒక ర‌క‌మైన ప్రైవేట్ లైఫ్ ఉండ‌క పోవ‌చ్చు. ఎప్పుడూ అధికార ప్ర‌భావంలో ఉండ‌టం.. ఎంతైనా వారికి ఇబ్బంది క‌ర‌మైన ప‌రిణామ‌మే. అను నిత్యం నిఘా క‌ళ్ల మ‌ధ్య జీవించాల్సి ఉంటుంది. ఇటీవ‌ల చిన్నపాటి రెస్ట్ తీసుకోడానికో ఏమో జిన్ పింగ్ కొన్నాళ్ల పాటు క‌నిపించ‌క పోవ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద అల‌జ‌డికి కార‌ణ‌మైంది. మోడీకంటే వ్య‌క్తిగ‌త జీవితంలో భాగంగా పెళ్లాం పిల్ల‌లే లేరు. దీనితో ఆయన ప్రత్యేకించి ప్రైవేట్ లైఫ్ కోరుకోక పోవ’చ్చని అంటారు విశ్లేషకులు.

ఇక ఆహార‌పు అల‌వాట్‌లు శారీర‌క ధారుడ్యం కూడా వీరికి స‌మ‌స్యాత్మ‌క‌మే. పుతిన్ ఎక్కడికి వెళ్లినా ఆ యా ప్రాంతాలకు చెందిన ఆహారాన్ని స్వీకరించలేరు. అది ప్రొటోకాల్. ఆయ‌న వెంట ఆయ‌న ఆహారం స‌మ‌కూర్చి పెట్టే చెఫ్ లు సైతం వ‌స్తారు. ఎందుకంటే ఎక్క‌డ ఏ ఫుడ్ పాయిజ‌న్ క‌లుస్తుందో అన్న ఆందోళ‌న కొద్దీ ఆయ‌న్ను బ‌య‌ట ఆహారం ఏది తిన‌నివ్వ‌రు. అంటే, పిచ్చాపాటిగా తిర‌గ‌డం లేదా ఇష్ట‌మొచ్చిన ఆహారాన్ని ఆస్వాదించ‌డంగానీ వీరికి వీలు కాద‌న్న మాట‌. ఇక ఈ స్థాయిలో ఉండే వారికి వ‌య‌సు ఎలాగూ మీద ప‌డే ఉంటుంది కాబ‌ట్టి జిహ్వ‌చాప‌ల్యం పెద్ద‌గా ఉండ‌క పోవ‌చ్చు. కానీ ఏది ఏమైనా కొన్ని చిన్న చిన్న కోరికలు వారికి సాధ్యం కాదనే చెప్పాలి. మరి మీరేమంటారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird