Home సినిమా ఒంటరిగా కూర్చున్నారని 2 వేలు ఫైన్! – Andhra Waves

ఒంటరిగా కూర్చున్నారని 2 వేలు ఫైన్! – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఒంటరిగా కూర్చున్నారని 2 వేలు ఫైన్!


ఓ యువతి మనసు బాగోలేక ప్లే గ్రౌండ్‌లోని బెంచ్‌పై ఒంటరిగా కూర్చుంది. అక్కడి వాతావరణంతో ప్రశాంతతను పొందసాగింది. ఇలాంటి సమయంలో మున్సిపల్ అధికారులు అక్కడికి వచ్చారు. ఆమెకు ఊహించని షాక్ ఇచ్చారు. ఒంటగరిగా కూర్చుందన్న కారణంతో ఏకంగా 2500 రూపాయలు ఫైన్ వేశారు. మున్సిపల్ అధికారులు ఎందుకలా చేశారో తెలియాలంటే.. ఈ మొత్తం స్టోరీ తెలుసుకోవాల్సిందే.

జర్మనీకి చెందిన హనా అనే యువతి చదువు, ఆర్థిక సమస్యల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ నేపథ్యంలోనే కాసేపు ప్రశాంతంగా నడవడానికి ఇంటినుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా ఒంటరిగా ఉండాలనే ఉద్దేశంతో ఓ ప్లేగ్రౌండ్ బెంచీపై కూర్చుంది. అత్తకు ఫోన్ చేసి తన బాధలు చెప్పుకుని ఏడవసాగింది. ఇంతలో అక్కడికి ముగ్గురు మున్సిపల్ అధికారులు వచ్చారు. ఉయ్యాల ఊగుతున్న ఇద్దరు బాలురు ఆమె పిల్లలేనా అని ప్రశ్నించారు. తనకు పిల్లలు లేరని హనా చెప్పడంతో, నిబంధనల ఉల్లంఘన కింద వారు వెంటనే జరిమానా విధించారు.

గెల్సెన్‌కిర్చెన్ మున్సిపల్ నిబంధనల ప్రకారం, ఆటస్థలాలు కేవలం 14 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలకు మాత్రమే. పిల్లలతో పాటు వచ్చే తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు మాత్రమే అక్కడ కూర్చునే అనుమతి ఉంటుంది. ఈ నిబంధన గురించి తనకు తెలియదని హనా చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. ”ఇందులో మానవత్వం ఎక్కడుంది? ఒకరు ఏడుస్తూ కనిపించినప్పుడు కనీసం ఏమైందని అడగకుండా, పిల్లలు లేకుండా కూర్చున్నందుకు జరిమానా వేయడం ఏమిటి?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

స్థానికులు సైతం అధికారుల చర్యను తప్పుబట్టారు. అయితే, అధికారుల చర్యను సిటీ కౌన్సిల్ సమర్థించుకుంది. పిల్లల ఆటస్థలాలు కేవలం పిల్లల కోసమేనని, పిల్లలు పెద్దలు అక్కడ ఉండటంపై సాధారణ నిషేధం ఉందని కౌన్సిల్ సభ్యుడు సైమన్ నోవాక్ స్పష్టం చేశారు.

The post ఒంటరిగా కూర్చుందని 2 వేలు ఫైన్! iDreamPostలో మొదట కనిపించారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird