Table of Contents
అతడో సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. కానీ, వన్నీ క్రిమినల్ పనులు. దేశ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలు, సెలబ్రిటీల ఇళ్లను టార్గెట్ చేశాడు. వరుసగా బాంబు బెదిరింపుల ఈ మెయిల్స్ పంపటం మొదలెట్టాడు. పది కాదు ఇరవై కాదు.. ఏకంగా 1500లకు పైగా నకిలీ బాంబు బెదిరింపుల ఈమెయిల్స్ పంపాడు. ఒకరకంగా చెప్పాలంటే జనాలను టార్చర్ చేశాడు. ఫేక్ బాంబు బెదిరింపులకు పులుస్టాప్ పెట్టడానికి, నిందితుడిని పట్టుకోవడానికి ముంబై పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ కీలక కేసులో పురోగతి కూడా సాధించారు.
నిందితుడిని అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన 28 ఏళ్ల శరత్ సుబ్రమణియన్ శంకర్‌గా పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లాతో పాటు ముంబైలోని బీఐటీ ప్రధాన కార్యాలయం, మెట్రో స్టేషన్లు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, కోర్టులు, పాఠశాలలు, ఇతర కీలక సంస్థలకు బెదిరింపు మెయిల్స్ పంపాడు. జూన్ 10వ తేదీన బీఎస్ఈ భవనంలో ఆర్డీఎక్స్ అమర్చినట్లు మెయిల్ పంపడంతో.. భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ మెయిల్స్ వచ్చిన ప్రతిసారీ భవనాలను ఖాళీ చేయించడం, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించడం వల్ల ప్రజా సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఎవరీ శరత్ సుబ్రమణియన్ శంకర్?
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన శంకర్.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో ఉంటున్నాడు. అతడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి టెక్ సంస్థల్లో పనిచేసినట్లు సమాచారం. ముంబై పోలీసులు అందించిన నిఘా సమాచారం మేరకు, జూలై నెలలో అమెరికా నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న శంకర్‌ను తమిళనాడు ఉగ్రవాద నిరోధక దళం అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అతడు తమిళనాడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. బెదిరింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ఇందులో ఇంకెవరికైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారించేందుకు అతడిని కస్టడీకి తీసుకుంటామని ముంబై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు.
ఎలా చిక్కాడంటే..
నిందితుడు తన గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు అనేక ఈ-మెయిల్ ఖాతాలు, వీపీఎన్, ఇతర అజ్ఞాత టూల్స్‌ను ఉపయోగించాడు. దీనితో దర్యాప్తు చేయటం కష్టంగా మారింది. అయితే, కేసు దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీస్ అధికారి ఒకరు ఈ-మెయిల్ ఆధారంగా నిందితుడితో సంభాషణ ప్రారంభించారు. అవతలి వ్యక్తి పోలీస్ అధికారి అని తెలియక శంకర్ తన వ్యక్తిగత ఈ-మెయిల్ ఖాతా నుంచి సమాధానం ఇవ్వడంతో అతని వివరాలు బయటపడ్డాయి.
మరో నిందితుడి పాత్రపైనా ఆరా
ఈ వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన 24 ఏళ్ల అంకిత్ శంఖ్వార్ పాత్రపైనా ముంబై పోలీసులు దృష్టి సారించారు. నకిలీ ఈ-మెయిల్ ఖాతాలను సృష్టించి విక్రయించే నెట్‌వర్క్‌ను అంకిత్ నడిపినట్లు యూపీ ఏటీఎస్ ఆరోపించింది. నవంబర్ 12వ తేదీన వచ్చిన ముంబైలోని ప్రముఖ సంస్థలకు బెదిరింపులకు అంకితం సృష్టించిన ఈ-మెయిల్ ఐడీలనే వాడినట్లు ఏటీఎస్. బంగ్లాదేశ్ జాతీయుడికి ఈ ఖాతాలను విక్రయించిన తుర్కియే, ఈజిప్ట్ వంటి దేశాల నుంచి అంకిత్‌కు 50,000 అమెరికన్ డాలర్లు అందినట్లు యూపీ ఏటీఎస్‌కు అందించారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
The post చిన్న పొరపాటుతో దొరికిపోయాడు.. appeared first on iDreamPost.
