
అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ అనే సాంగ్ ఆటోమెటిక్ గా ధురంధర్ భామ సారా అర్జున్, ఆకాశంలో ఒక తార భామ సాత్విక వీరవల్లిని చూస్తే చాలు పాడుకుంటాం. అంతలా తన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేసి పడేస్తారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మల మధ్య ఆసక్తికర పోటీ ఏర్పడే అవసరం వచ్చింది.
పుష్ప 2 తో నేషనల్ లెవల్లో క్రేజ్ పొందిన చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న(రాక్ 17 ) సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలుసా. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
RC17 హీరోయిన్ రేసులో ప్రధానంగా ఇద్దరు భామల పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాత్విక వీరవల్లి కాగా.. మరొకరు ‘ధురంధర్’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సారా అర్జున్. వీరిద్దరిలో ఎవరిని సుకుమార్ ఎంపిక చేస్తారనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా సాత్విక వీరవల్లికి ఈ అవకాశం వస్తే తెలుగమ్మాయికి ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ దక్కినట్లవుతుంది. ‘ఆకాశంలో ఒక తార’లో ఆమె నటన చూసిన తర్వాత సుకుమార్ టీమ్ ఆమెపై ఆసక్తి చూపిస్తున్న ప్రచారం. ఈ ఆఫర్ ఆమెకు టెస్ట్ అవకాశాలు, స్క్రీన్ టెస్ట్ నిర్వహించే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: బాస్ 25 వ సినిమా: ఆ దర్శకుడు ఖాయమయ్యాడ: ఫ్యాన్స్ అసలు విజిల్స్ ఆపద్దు!
మరోవైపు సారా అర్జున్ పేరు కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో మొదటి నుంచీ వినిపిస్తోంది. ‘మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామను హీరోయిన్గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందనే వార్తలు గతంలో వచ్చాయి. దీంతో రామ్ చరణ్ పక్కన సారా కనిపిస్తే కొత్త జోడీగా ఉంటుందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అయితే సారా, సాత్వికతో పాటు శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, ప్రీతి ముకుందన్ పేర్లు కూడా హీరోయిన్ ఎంపిక విషయంలో ప్రచారంలోకి వచ్చాయి. కొంతమందికి క్యారెక్టర్లు, లుక్స్ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి.సుకుమార్ సినిమాల్లో హీరోయిన్స్ కి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.

దీనితో సాత్వికకి చరణ్ అవకాశం లభిస్తుందని తెలుగు అభిమానులు కోరుకుంటుంటే.. మరోవైపు సారా అర్జున్ని సరసన చూడాలని కొందరు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ పేర్లతో ఇద్దరి చుట్టూ సోషల్ మీడియాలో చర్చ. తాజాగా హీరోయిన్ ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయి. సుకుమార్ హీరోయిన్ను ఇప్పటికే ఖరారు చేశారనే ప్రచారం కూడా మొదలైంది. కానీ అధికారికంగా మాత్రం చిత్రబృందం ఎవరి పేరు ప్రకటించలేదు.
మీకు నచ్చవచ్చు
తోట వైకుంఠం అరుదైన పెయింటింగ్ దక్కించుకున్న ఎన్టీఆర్: ఆ హీరో ట్వీట్ వైరల్!
Nanna Kutty Movie Review Telugu: నాన్న కుట్టి మూవీ రివ్యూ
సాత్విక వీరవల్లి, సారా అర్జున్, రామ్ చరణ్, సుకుమార్, RC17
