(28).webp)
క్యాన్సర్ అనే మాట వినగానే మనలో తెలియని ఆందోళన మొదలవుతుంది. ఆధునిక వైద్య చికిత్సలు అందుబాటులో ఉండటం, చిన్న వయసులోనే ఎంతోమంది ఈ సమస్య బారిన పడుతుండటం కలవరపెడుతోంది. అసలు క్యాన్సర్ బయటకు కనిపించడానికి కొన్నేళ్ల ముందే మన శరీరంలోని కణజాలంలో నిశ్శబ్దంగా మార్పులు మొదలవుతాయి. ఎండ, మానసిక ఒత్తిడి, మనం పీల్చే గాలి కారణంగా ప్రతిక్షణం మన డీఎన్ఏ దెబ్బతింటూ ఉంటుంది.
సాధారణంగా శరీరం ఆ లోపాలను సరిదిద్దుకుంటుంది, కానీ కొన్నిసార్లు కణాల అదుపు పెరగడం మొదలుపెడతాయి. కిఫీ హాస్పిటల్ ఇన్స్టాగ్రామ్ వీడియోలో డాక్టర్ కరుటూరి సుబ్రమణ్యం పంచుకున్న వివరాల ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన పండ్లు మరియు ఆహార అలవాట్లు ఈ ముప్పును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మొదటగా టటో విషయానికి వస్తే, దీనిని పచ్చిగా తినడం కంటే ఉడికించి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం లభిస్తుంది. వేడి చేసినప్పుడు టమాటోలోని లైకోపీన్ అనే శక్తివంతమైన పోషకం సులభంగా విడుదలవుతుంది. కేవలం మూడు వారాల పాటు ఉడికించిన టమాటో గుజ్జును తిన్నవారిలో క్యాన్సర్ కణాలు 3 రెట్లు వేగంగా నశించినట్లు, అలాగే డీఎన్ఏ డ్యామేజ్ 28 శాతం తగ్గినట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

అందుకే ఉడికించిన టమాటోను కొద్దిగా మంచి నూనెతో కలిపి తినాలని డాక్టర్ సుబ్రమణ్యం సూచించారు. ఇక స్ట్రాయ్స్ విషయంలో జరిగిన 6 నెలల ప్రయోగంలో గొంతు వద్ద క్యాన్సర్‌కు ముందు దశ మార్పులు ఉన్నవారికి రోజుకు 4 కప్పుల స్ట్రాబెర్రీస్కు సమానమైన పౌడర్ ఇచ్చారు. ఫలితంగా 80 శాతం మందిలో తగ్గుదల పెరుగుదల ఆగిపోగా, మరింత మందిలో రిపోర్టులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి.
ఇది కూడా చదవండి:ఒంట్లో వేడి తగ్గి, ఉక్కులాంటి బలం.. రాగి అంబలి సీక్రెట్ ఇదే!
బ్లూ వేర్లు కూడా మనకి తక్షణ రక్షణని కలిగి ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటిని తిన్న కేవలం ఒక్క గంటలోనే రక్తకణాలపై జరిగే డీఎన్ఏ దాడి 18 శాతం తగ్గినట్లు గమనించారు. పెద్ద పేగు క్యాన్సర్‌తో సంబంధం ఉన్న కళ్యాణ అతిపెరుగుదల స్విచ్ విషయంలో ఎర్ర ద్రాక్ష ఆసక్తికర ఫలితాలను చూపింది. కేవలం 2 వారాల పాటు రోజుకు 2 కప్పుల ఎర్ర ద్రాక్ష తిన్న 50 ఏళ్లు పైబడినవారిలో ప్రమాదకరమైన సిగ్నల్స్ తగ్గి, దాదాపు పాతికేళ్ల వయసున్న యువకుల స్థాయికి చేరుకున్నాయి. గోల్డెన్ కివీ విషయానికి వస్తే, రోజుకు ఒక్క కివీ పండు తినడం వల్ల డీఎన్ఏ దెబ్బతినకుండా ఉండటమే కాకుండా, ఇప్పటికే పాడైన డీఎన్ఏను రిపేర్ చేస్తే ఎంజైమ్‌ల పనితీరు కూడా వేగవంతమవుతుంది.

అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. ఇలాంటి పండు తిన్నా అందరికీ ఒకే ఫలితం రాకపోవచ్చు. పండ్లలోని పోషకాలను క్యాన్సర్‌ను ఎదుర్కొనే యూరోలిథిన్ ఏ వంటి శక్తివంతమైన సమ్మేళనాలుగా మార్చాలంటే మన పొట్టలో మంచి కనిపించాలి. కేవలం 40 శాతం మంది మాత్రమే ఈ ఆరోగ్యాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు. మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి పూర్తిగా ఉపయోగపడాలంటే గట్ హెల్త్ చాలా ముఖ్యం. అందుకే ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండు, వాల్నట్స్ రోజూ ఆహారంలో చేర్చుకుంటూ పొట్టలోని మంచిని పెంచుకోవాలని డాక్టర్ సుబ్రమణ్యం స్పష్టం చేశారు.
మీకు నచ్చవచ్చు:చలికాలంలో, జలుబు దగ్గుకు చెక్ పెట్టే, మిరియాల కోడిగుడ్డు కూర!
ప్రసాదాన్ని, తలపించే రుచి.. ఇంట్లోనే ఈజీగా బెల్లం గోధుమ రవ్వ కేసరి!
క్యాన్సర్‌తో పోరాడే పండ్లు, తక్కువ క్యాన్సర్ రిస్క్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్, క్యాన్సర్ ప్రివెన్షన్ డైట్, హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్, న్యూట్రిషన్ అండ్ వెల్నెస్, హెల్త్ టిప్స్ తెలుగులో.
