.webp)
విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్.!
జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. 27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (2026–27)లో బిగిల్ తెలంగాణ పోలీస్ బృందం రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ విజేతలను అభినందించారు.నవంబర్ 16 నుంచి 20 వరకు హైదరాబాద్‌లోని సీఆర్‌పీ గ్రూప్ సెంటర్‌లో ఈ పోటీలు జరిగాయి. వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలకు చెందిన బ్యాండ్, బిగిల్ బృందాలు పోటీల్లో పాల్గొన్నారు.
.webp)
పోటీ మధ్య తెలంగాణ బృందం రజత పతకం సాధించడం విశేషం.ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ పోలీస్ ప్రతిభను చాటడం గర్వకారణమని పేర్కొన్నారు. పోలీస్ బిగి బ్యాండ్ బృందాలను మరింత మెరుగుపరిచి, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేలా చర్యలు తీసుకుంటాం.
రజత పతక విజేతలు వీరే..!
ఈ బృందానికి ఎస్. సంతోష్ (HC 1967) ఇన్‌చార్జ్, కెప్టెన్‌గా వ్యవహరించగా, కె. స్వామి (HC 2562), ఎస్. వెంకటయ్య (HC 873), జి. వెంకటస్వామి (HC 1427), ఏవీఎస్ భావన రుషి (HC 197), పీసీలు కె. రామ్‌లాల్ (PC 3361), ఎస్. ప్రవీణ్ కుమార్ (PC 10250) సభ్యులుగా ఉన్నారు.వీరంతా రాష్ట్రంలోని వివిధ పోలీస్ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ సంస్థలు, హైదరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఐజీ డా. గజరావు భూపాల్, స్పోర్ట్స్ డీఎస్పీ డా. రామారావుతో పాటు పోలీసు అధికారులు ఉన్నారు.
మీకు నచ్చవచ్చు: నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రభాస్ మద్దతు: ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
మీకు నచ్చవచ్చు: రేకుల గదికి నెలకు రూ. 2.12 లక్షల అద్దె.. ఎక్కడో తెలుసా?
[ Telangana Police, DGP CV Anand, All India Police Band Competition 2026-27, 27th All India Police Band Competition, Telangana Police Silver Medal, Bugle Competition, CRPF Group Centre Hyderabad, Telangana Police Band Team, Police Achievements ]
