క్రికెట్‌లో టాలెంట్ ఉంటే సరిపోదు.. అవకాశాలు కూడా రావాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా.. జట్టులో ప్లేస్ పర్మనెంట్ అన్న గ్యాంటీ లేదు. ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ఖాన్ యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ఈ ఆటగాడికి భారత జట్టులో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. మళ్లీ రెండేళ్ల కిందట డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు లీక్ చేశాడనే ఆరోపణలు కూడా అతడిని తీవ్రంగా బాధించాయి. తాజాగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో మాట్లాడిన సర్ఫరాజ్.. ఆ ఆరోపణల సమయంలో తాను ఎంత మానసిక వేదన అనుభవించాడో చెప్పుకొచ్చాడు. తన తండ్రి పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలు సర్ఫరాజ్‌పై వచ్చిన ఆరోపణలు ఏంటి? ఆ సమయంలో గౌతమ్ గంభీర్ అతడికి ఎలా అండగా నిలిచాడు? చిన్నప్పటి నుంచి అతడి కుటుంబం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది? వివరంగా చూద్దాం.
సర్ఫరాజ్ ఖాన్‌పై డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన విషయాలు బయటకు లీక్ చేశాడనే ఆరోపణలు వచ్చిన సమయంలో అతడు చాలా బాధపడ్డాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ గుర్తుచేసుకున్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సమయంలో గాయపడటంతో నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లానని చెప్పాడు. ఆ టోర్నీ ముగిసిన దాదాపు 20 రోజుల తర్వాత తనపై ఒక్కసారిగా లీక్ ఆరోపణలు మొదలయ్యాయని తెలిపాడు. ఆ సమయంలో విమానం దిగి ఇంటికి వెళ్తున్నప్పుడు తనకు పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వచ్చాయని చెప్పాడు. సోషల్ మీడియాలో కూడా చాలామంది తన గురించి రకరకాలుగా రాశారని గుర్తుచేసుకున్నాడు.
తనపై వచ్చిన ఆరోపణలను సర్ఫరాజ్ ఖండించాడు. నిజంగా తానే డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటపెట్టి ఉంటే.. ఆ తర్వాత భారత్-ఎ జట్టుకు, శ్రీలంక సిరీస్‌కు ఎలా ఎంపికయ్యేవాడినని ప్రశ్నించాడు. ఈ ఆరోపణలు వచ్చిన సమయంలో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పాడు. కొంతమందికి ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నించినా ఎవరూ స్పందించలేదని తెలిపాడు. దీంతో తీవ్రంగా కుంగిపోయి తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నానని వెల్లడించాడు.
ఆ సమయంలో తనకు అండగా నిలిచిన వ్యక్తి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని సర్ఫరాజ్ చెప్పాడు. గంభీర్ తనకు పలుమార్లు ఫోన్ చేశారని, తన తండ్రికి కూడా కాల్ చేసి మాట్లాడారని గుర్తుచేసుకున్నాడు. బయట ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోవడం లేదు.. ఆట మీద మాత్రమే దృష్టి పెట్టాలని గంభీర్ సూచించారట. అప్పుడు తన మనసులోని బాధను గంభీర్‌తో పంచుకున్నానని సర్ఫరాజ్ తెలిపాడు. ‘సర్.. పరిస్థితి నాకు అర్థమైంది. కానీ మా నాన్న చాలా బాధపడుతున్నారు. నా భార్య కూడా ఏడుస్తోంది’ అని వెల్లడించాడు. ఆ సమయంలో తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన మొదటి వ్యక్తి గంభీర్ అని సర్ఫరాజ్ భావోద్వేగానికి క్లియర్ అయ్యాడు.
ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ తన చిన్ననాటి రోజులను కూడా గుర్తుచేసుకున్నాడు. తమ కుటుంబం ఒకప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పాడు. అందరం కలిసి ఒక చిన్న గుడిసెలో నివసించేవాళ్లమని తెలిపాడు. తన తండ్రి కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తుచేసుకున్నాడు. ఆ మాటలు గుర్తుచేసుకుంటూ సర్ఫరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
చిన్నతనంలో ముంబయిలో అండర్-16 క్రికెట్ ఆడితే కనీసం రూ.9 వేలు వస్తుందని సర్ఫరాజ్ చెప్పాడు. అప్పుడే క్రికెటర్ కావాలనే కోరిక బలంగా ఉందని తెలిపాడు. కేవలం క్రికెట్ మీద ప్రేమతోనే కాకుండా.. తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో ఆటను ఎంచుకోవాలని చెప్పాడు. ముంబయి జట్టుకు ఆడటం, అండర్-19 జట్టుకు ఎంపిక కావడంతో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడిందని వివరించారు.
తన తండ్రి తమ కోసం ఎన్నో త్యాగాలు చేశారు సర్ఫరాజ్. అందుకే ఇప్పటికీ తాను సంపాదించిన డబ్బు తండ్రి చేతికే ఇస్తానని వెల్లడించాడు. తన జీవితంలో తండ్రి పాత్ర ఎంతో గొప్పదని చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు కుటుంబాన్ని పోషించడానికి కష్టపడిన తండ్రి.. ఇప్పుడు తన విజయాలను చూస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యాడు.
ఒకవైపు అవకాశాల కోసం ఎదురుచూపులు.. గతంలో ఎదురైన ఆరోపణల బాధ.. ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు సర్ఫరాజ్ ఖాన్. చిన్న గుడిసెలో మొదలైన అతడి ప్రయాణం.. అంతర్జాతీయ క్రికెట్ వరకు చేరింది.
