దోహా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఎ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్-బిలో భాగంగా నేపాల్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ తడబడింది. టీ20 స్పెషలిస్ట్ లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నేపాల్ కెప్టెన్ సందీప్ లామిచానే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.. బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఎ నిర్ణీత 16 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది.
టాప్ ఆర్డర్ విఫలం.. వైభవ్ ఒక్కడే కాస్త మెరుపు
భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 13 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 9 పరుగులు చేశాడు అతడు నందన్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు సాధించి పవన్ షరఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బడోని కూడా నిరాశపరిచాడు. 7 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి లలిత్ రాజ్ బన్షి బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో భారత జట్టు తక్కువ స్కోరుకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
శిక్షణ చక్కదిద్దే పనిలో తిలక్, కుశాగ్ర
ప్రస్తుతం భారత కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర క్రీజులో ఉన్నారు. తిలక్ 29 బంతుల్లో 13 పరుగులతో, కుశాగ్ర 15 బంతుల్లో 10 పరుగులతో ఆడుతున్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. నేపాల్ బౌలర్లలో నందన్ యాదవ్, పవన్ షరఫ్, లలిత్ రాజ్‌బన్షి తలో వికెట్ తీసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా రాజ్‌బన్షి కేవలం 8 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
