Home సినిమా రమ్యకృష్ణ మొదటి సంపాదన ఎంతో తెలుసా? సినిమాల్లోకి రాకముందే ఆమె ఏం చేశారంటే! – Andhra Waves

రమ్యకృష్ణ మొదటి సంపాదన ఎంతో తెలుసా? సినిమాల్లోకి రాకముందే ఆమె ఏం చేశారంటే! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


రమ్యకృష్ణ.. తెలుగు సినిమాకి దొరికిన అపురూపమైన వజ్రం లాంటి నటి. ఆ వజ్రం తాలూకు చిత్రాలు అభిమానులు, ప్రేక్షకుల మనసులో చాలా భద్రంగా ఉన్నాయి. డాన్సర్ గా కూడా చించి పడేయగలదు. పెర్ఫార్మ్ పరంగాను మెప్పించగలదని సూత్రధారులు మూవీనే చిన్న ఉదాహరణ. జెన్ జీ బ్యాచ్ కోసం బాహుబలి ఉండనే ఉంది.

చిన్న వయసులోనే కళారంగంపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి ప్రవేశించిన రమ్యకృష్ణ, తన అద్భుతమైన ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ రోజుల్లోనే ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్లు, నాటి జ్ఞాపకాలు నేటికీ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంటాయి.

ప్రస్తుతం సినిమాలతో పాటు రియాలిటీ షోలకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆమె అందుకుంటున్న భారీ పారితోషికాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.రమ్యకృష్ణ మాట్లాడుతూ.. నేను డ్యాన్సర్ ని. కూచిపూడి నేర్చుకునేదాన్ని. వెంపటి చిన సత్యంగారు మా గురువు. రోజూ స్కూల్ అవ్వగానే డ్యాన్స్ క్లాస్ కి వెళ్లేదాన్ని. రోజూ స్కూల్ నుంచి స్కూల్ డ్రెస్ తోనే వెళ్లేదాన్ని.

ఒకరోజు అనుకోకుండా సల్వార్ కమీజ్ వేసుకొని వెళ్ళాను. ఆ రోజు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కి డ్యాన్సర్లు కావాలని నన్ను కూడా సెలెక్ట్ చేసారు. సల్వార్ కమీజ్ లో చూసి పెద్ద అమ్మాయిని అనుకోని సెలెక్ట్ చేసారు. తర్వాత స్కూల్ డ్రెస్ లో చూసి వద్దన్నారు. కానీ నేను చేస్తాను అని అడుక్కున్నాను. ఇదంతా 8వ తరగతిలో జరిగింది.

ఇది కూడా చదవండి: సీసీస్ లో రాముడి ఓవర్ కలెక్షన్ల తుఫాన్: 11 రోజుల్లోనే ఆల్-టైమ్ రికార్డు!

ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కి వంద రూపాయలు ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. అప్పట్లో ఆ డబ్బులు ఎక్కువ. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫోటోలు చూసి భారతి రాజా, టి రాజేందర్ చూసి నన్ను ఆడిషన్ చేసి సినిమాలు ఆఫర్ చేసారు. కానీ ఆ రెండు చేయకుండా ఒక కమెడియన్ తో సినిమా చేశా. అలా 14 ఏళ్లకే హీరోయిన్ అయ్యాను. స్కూల్ లో హోమ్ వర్క్, ఎగ్జామ్స్ తప్పించుకోవచ్చు అని యాక్టింగ్ వైపు నేను చెప్పాను అని చెప్పాను మొదట్లో అని వెళ్తుంది.

అప్పట్లో చిన్నగా మొదలైన ఆమె ప్రయాణం, నేడు పాన్ ఇండియా రేంజ్‌లో కోట్లాది రూపాయల సంపాదనకి చేరుకోవడం విశేషం. ఒకవైపు వ్యాపారాలు, మరోవైపు గ్లామరస్ పాత్రలు, టెలివిజన్ షోలతో రమ్యకృష్ణ తన క్రేజ్‌ను ఎప్పటికీ తగ్గకుండా చూస్తున్నారు. నటిగా ఆమె ప్రయాణం ఎందరో యువ నటిమణులకు ఒక స్పూర్తిదాయకమైన పాఠం లాంటిది.

తెరపై గ్లామర్ , తీవ్రమైన భావోద్వేగాలు పండించే రాజసం ఉట్టిపడే పాత్రలైనా రమ్యకృష్ణ వాటికి పూర్తిన్యాయం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె మొదటి సంపాదనకు సంబంధించిన చిన్న విశేషం వెలుగులోకి రాగానే అభిమానులు దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:ఆ మూవీకి 11000 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి: వెలుగులోకి వచ్చిన నిజం!
మీకు నచ్చవచ్చు:అక్కినేని కోడళ్ళ గొప్పతనం!

[Ramya Krishnan, first income,Tollywood, Sivagami]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird