థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి అదిరిపోయే క్రైమ్ మిస్టరీ మూవీ . మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం జీ5లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. టోవినో థామస్, త్రిష కృష్ణన్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తే ఇన్వెస్టిగేషన్, యాక్షన్ సన్నివేశాలతో సాగుతుంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ దారుణమైన హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఆ నేరానికి సంబంధించిన కీలక ఆధారం ఒక ప్రత్యక్ష సాక్షి దగ్గర ఉంటుంది. అయితే ఆమెకు నిందితుడి ముఖాన్ని గుర్తుపెట్టుకోవడంలో ప్రత్యేక సమస్య ఉంటుంది. దీనితో ఆమె చెప్పే వివరాల ఆధారంగా నిందితుడి రూపాన్ని రూపొందించేందుకు పోలీసులు స్కెచ్ ఆర్టిస్ట్ సహాయం తీసుకుంటారు.
ఈ హామీ పోలీస్ అధికారి, స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తారు. సాక్షి చెప్పిన వివరాలతో కిల్లర్‌ను గుర్తించే ప్రయత్నం మొదలవుతుంది. కానీ దర్యాప్తు సాగుతున్న కొద్దీ అనుమానాలు పెరుగుతాయి. ఒక్కో విషయం బయటపడుతున్న కొద్దీ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. అసలు నేరస్థుడు ఎవరు? ఈ కేసులో ఎవరిని నమ్మాలి? అనే ప్రశ్నలకు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమా పేరు ఐడెంటిటీ.. ఈ సినిమా ప్రస్తుతం జీ5 లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఉంది. ఇంకా ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి.
మరిన్ని ఓటిటి అప్డేట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
