Home సినిమా ENE రిపీట్: బతుకమ్మ సాంగ్.. శ్రేయ ఘోషల్ వాయిస్, చంద్రబోస్ లిరిక్స్ అదుర్స్.! – Andhra Waves

ENE రిపీట్: బతుకమ్మ సాంగ్.. శ్రేయ ఘోషల్ వాయిస్, చంద్రబోస్ లిరిక్స్ అదుర్స్.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


‘ఈ నగరానికి ఏ’.. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది కల్ట్ మూవీస్‌లో ఇదొకటి. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలు, కామెడీ, ఎమోషన్స్‌తో తరుణ్ భాస్కర్ ఈ సినిమాను ఓ ప్రత్యేకమైన అనుభూతిగా మలిచారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘ENE Repeat’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నవంబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ‘బతుకమ్మ’ పాట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ పాటను రూపొందించారు. బతుకమ్మ పండుగ అంటే కేవలం పూలను పేర్చి పూజించడం మాత్రమే కాదు.. ఆడపడుచుల ఆనందం, కుటుంబ సభ్యుల కలయిక, స్నేహితుల సందడి, ఆటపాటల సమాహారం. ఈ పండుగలో ఉండే అసలైన రంగులను పాటల్లో చూపించే ప్రయత్నం చేశారు.

అయితే ఈ పాటలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఒక అమ్మాయి తనకు ఎలాంటి భర్త కావాలో చెబుతున్నట్టుగా చంద్రబోస్ సాహిత్యం సాగుతుంది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఓ అమ్మాయి మనసులోని కోరికలను పాట రూపంలో చెప్పడం మంచి ఆలోచన.

ఈ పాటకు ప్రధాన ఆకర్షణ శ్రేయ ఘోషల్ గాత్రం. ఎన్నో భాషల్లో అద్భుతమైన పాటలు పాడిన ఆమె.. తన మధురమైన గొంతుతో ఈ పాటకు ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: 50 ఏళ్ల ‘ఊరుమ్మడి బతుకులు’.. స్టార్ హీరోలు లేకుండానే జాతీయ అవార్డు కొట్టిన తెలుగు సినిమా.!

ఇక వివేక్ సాగర్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరుణ్ భాస్కర్ సినిమాలకు ఆయన అందించే సంగీతంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ఇప్పుడు బతుకమ్మ పాటలో కూడా తెలంగాణ జానపద వాతావరణానికి తగ్గట్టుగా బాణీలను అందించారు.

దీనికి చంద్రబోస్ సాహిత్యం తోడవడంతో పాటకు మరింత అందం వచ్చింది. ముఖ్యంగా పండుగ సంబరాలను గుర్తుచేసే సంగీతం, శ్రేయ ఘోషల్ వాయిస్ కలిసిన విధానం ఆకట్టుకుంటోంది.

ఈ పాట లిరికల్ వీడియోలో శివాత్మిక అందంగా కనిపిస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆమె లుక్, హవభావాలు పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. పండుగ వాతావరణంలో ఆమె కనిపిస్తున్న తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఏలేటి ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ కూడా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మీకు నచ్చవచ్చు:
శోభన్ బాబుకు స్టార్‌డమ్ తెచ్చిన మూవీ.. ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ వెనుక ఇన్ని విశేషాలా.?
చచ్చిపోకముందే వెళ్లిపోండి.. ‘పైర్’ కథ వింటే కన్నీళ్లు ఆగవు.!

[ENE Repeat Movie, Bathukamma Song, Shivathmika, Shreya Ghoshal, Vivek Sagar]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird