Home సినిమా శ్రీలీల: శ్రీ లీలకు ఏమైంది..మరీ ఇలాంటి డ్రెస్ లోనా.. అభిమానులు ఏం కావాలి.. – Andhra Waves

శ్రీలీల: శ్రీ లీలకు ఏమైంది..మరీ ఇలాంటి డ్రెస్ లోనా.. అభిమానులు ఏం కావాలి.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper



sreeleela-viral-video-ai-deepfake-controversy-fans-reaction

శ్రీలీల: శ్రీ లీల.. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. డ్యాన్స్ అద్భుతంగా చేస్తుంది. అదే సమయంలో నటన కూడా ఇరగదీస్తుంది. అందువల్లే అప్పట్లో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. టాప్ యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లభించింది. 2019లో కిస్ అనే కన్నడ సినిమా ద్వారా ఈ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరం బరాటే అనే సినిమా లో కూడా నటించింది. పెళ్లి సందడి అనే సినిమా ద్వారా 2021లో తెలుగు చిత్ర పరిశ్రమలకు అడుగుపెట్టింది. 2022లో బై టు లవ్.. అదే సంవత్సరం ధమాకా.. 2023లో స్కంధ.. అదే సంవత్సరం భగవంత్ కేసరి.. ఆదికేశవ.. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ .. గుంటూరు కారం.. పుష్ప 2(స్పేషల్ సాంగ్), రాబిన్ హుడ్.. జూనియర్ బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళంలో అజిత్ సరసన ఒక చిత్రంలో నటించబోతోంది.

శ్రీ లీల అందంగా ఉంటుంది. అలాగని తన పాత్ర పరిధి మేరకు మాత్రమే గ్లామర్ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల పరిధి దాటిపోదు. ఎందుకంటే తన హద్దులు తనకు తెలుసు. పైగా అసభ్యమైన పాత్రలను అస్సలు ఒప్పుకోదు. అదర చుంబనం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ ఇప్పుడు శ్రీ లీలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను చూసిన శ్రీ లీల అభిమానులు ఇదేంటి ఇలా అయిపోయిందని కామెంట్ చేస్తున్నారు.

ఆ వీడియోలో శ్రీ లీల వేసుకున్న డ్రెస్ చాలా అభ్యంతరకరంగా ఉంది. నిజానికి అలాంటి అవతారంలో ఆమెను ఎన్నడు అభిమానులు చూడలేదు. పద్ధతి గల దుస్తుల్లో ఆమె కనిపించారు. పైగా పాత్రల విషయంలో కూడా ఆమె అటువంటి జాగ్రత్తలే తీసుకున్నారు. కానీ, ఇటీవల సినిమాలు లేకపోవడంతో శ్రీ లీల గ్లామర్ షో కోసం కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆ వీడియోలో నిజం లేదని శ్రీ లీల అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో కొంతమంది టెక్నాలజీ సాయంతో చండాలమైన వీడియోలను రూపొందించారు. ముఖ్యంగా టాప్ సెలబ్రిటీల విషయంలో తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఆ వీడియోను రూపొందించడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా బయటికి వదులుతున్నారు. నుండి సెలబ్రిటీలు డ్యామేజ్ అవుతున్నాయి. దేవర సినిమాలో జాన్వి కపూర్.. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ.. వారి వీడియోలను టెక్నాలజీ ద్వారా రూపొందించి.. వారిని ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు శ్రీ లీలను టార్గెట్ చేశారు. నిజానికి ఆమె బాలీవుడ్‌లో చేసినా.. మరో ఇండస్ట్రీలో సినిమాలు చేసినా తన పరిధి అస్సలు దాటలేదు. కానీ కొంతమంది ఆమెను అనవసరంగా ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ వీడియో శ్రీ లీల దృష్టికి వచ్చిందా.. వస్తే ఆమె ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird