
అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొన్న ఘోర పరాజయం తరువాత అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తప్పులు చేశానని ఒప్పుకున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా.. తన ప్రభుత్వం అనుసరించిన వలసదారుల బహిష్కరణ, నిర్బంధ విధానాల కారణంగానే మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది.
వలసదారులపై కఠిన నిబంధనలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపాయి, అదే మధ్యకాలంలో తమ ఓటమికి కారణమైందని తలపట్టుకున్నారు. వలసదారుల పట్ల మరీ అంత కఠినంగా వ్యవహరించి ఉండకూడదని ఆయన ఓ ఇంటర్వ్యూలో అంగీకరించడంతో ఈ ఓటమితో ట్రంప్ కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందని పరశీలకులు విశ్లేషిస్తున్నారు. నేరస్థులను, డ్రగ్ డీలర్లను వెళ్లగొట్టడం పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
అయితే ఎలాంటి నేర చరిత్ర లేని సాధారణ వలసదారులపై కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం చేకూర్చిందని ఆయన ఆత్మవిమర్శ చేసుకున్నారు. హోటళ్లు, ల్యాండ్‌స్కేపింగ్ కంపెనీలలో క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్న మంచి వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టడమే మధ్యంతర ఎన్నికలలో తమ కొంప ముంచిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

అయినా కింద పడ్డా తనదే పైచేయి అన్న చందంగా దేశ సరిహద్దుల భద్రత విషయంలో తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందంటూ ట్రంప్ తన భుజాలు తానే చరుచుకున్నారు. సరిహద్దులను పటిష్టంగా పట్టుకోవడం వల్ల గత కొన్ని నెలలుగా ఎవరూ అక్రమంగా దేశంలోకి ప్రవేశించలేదని, దీనివల్ల ప్రజల నుంచి తనకు మంచి ప్రశంసలు దక్కాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: వలసదారుల విషయంలో తప్పు చేశాము..ఓటమిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.!
సమర్థులైన కార్మికుల జీవనం సాగిస్తున్న వలసదారుల విషయంలో భవిష్యత్తులో చట్టబద్ధత కల్పించే దిశగా తగిన ఒప్పందాలు లేదా వెసులుబాట్లు ఉండే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు సాధించిన తరుణంలో, వలస విధానాల రూపకల్పనలో వైఖరి మార్చుకునే సంకేతాలను ట్రంప్ ఇచ్చినట్లు రాజకీయ పరిశీలకులు ప్రకటించారు. మరోవైపు, వలసల నిరోధక చర్యల్లో పాత్ర పోషించిన అధికారులు తమ పంథా వీడేది లేదని భీష్మిస్తున్నట్లు సమాచారం. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వలస కార్మికుల పట్ల భవిష్యత్తులో ఎలాంటి విధానాలు అమలులోకి వస్తాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి చూపుతోంది. ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని, కఠిన నిబంధనల్లో కొంతమేర సడలింపులు ఇస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. తరువాత కాలంలో ఇమిగ్రేషన్ చట్టాలు, వలసదారుల హక్కుల పరిరక్షణపై అమెరికా రాజకీయాల్లో మరింత వేడి రాజుకునే అవకాశం ఉంది.
మీకు నచ్చవచ్చు: ట్రంప్ హత్యకు కుట్ర భగ్నం: నిందితుడి అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం.!
అమెరికా మధ్యంతర ఎన్నికలు: ట్రంప్ పాలనపై రిఫరెండం: మార్పు కోరుకుంటున్న అమెరికాలు.!
[Donald Trump Backfoot, Immigration, Policy, US Midterm Elections Republican Defeat, Mass Deportation, Undocumented Immigrants, America Politics, TeluguOne]
