Home ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh Politics: ఈ దాడులతో.. పులివెందుల ఫ్యాక్షన్.. – Andhra Waves

Andhra Pradesh Politics: ఈ దాడులతో.. పులివెందుల ఫ్యాక్షన్.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Andhra Pradesh Politics: ఈ దాడులతో.. పులివెందుల ఫ్యాక్షన్.. మరోసారి ప్రపంచానికి తెలిసింది..

Andhra Pradesh Politics:ఏపీలో కోనసీమ అంటే మనకు గుర్తుకొస్తుంది పచ్చని కొబ్బరి చెట్లు.. గోదావరి నీరు.. పంట పొలాలు.. నెల్లూరు పేరు చెప్తే చేపల పులుసు.. సముద్రం.. గుంటూరు పేరు చెప్తే మిరపకాయలు.. విజయవాడ పేరు చెప్తే కనకదుర్గమ్మ.. ఇలా ఒక్కొక్కటి ఒక్కో చరిత్రాత్మక నేపథ్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టి.. పెట్టుబడులు వస్తున్నాయి. పర్యాటకులు వస్తున్నారు. చంద్రబాబు రూపంలో సమర్థవంతమైన నాయకత్వం ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి ఉంది. అయినప్పటికీ అరాచకవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. దుర్మార్గులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమైన ఎన్నికల సమయంలో తమ దాడుల సంస్కృతిని కొనసాగిస్తూనే ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కడప.. తిరుపతి జిల్లాలలో పెట్రోల్ బాంబులతో అరాచక శక్తులు దాడులు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మండలం ఎర్రిపల్లె పోలింగ్ కేంద్రం వద్ద బాహాబాహీ జరిగింది. ముందుగా ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద భారీగా వైసీపీ కార్యకర్తలు వచ్చారు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సహనం కోల్పోయిన వారు పెట్రోల్ బాంబులు వేశారు. దీంతో భారీగా మాటలు వచ్చాయి. పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది.

తిరుపతి జిల్లా పెనగలూరు వైసిపి నల్లపురెడ్డి పల్లెలో కార్యకర్తలు మొత్తం బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులు పోలింగ్ కేంద్రానికి సమీపంలో పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సి వచ్చింది.

కడప జిల్లా నందలూరు ప్రాంతంలో కూడా ఇదే స్థాయిలో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రొద్దుటూరు.. తిరుపతి.. జమ్మలమడుగు ప్రాంతాల నుంచి భార్య రౌడీలు అక్కడికి వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో స్థానికులు వారి వాహనాలను పూర్తిగా అడ్డుకున్నారు. పోలీసులు రౌడీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు.

ఉత్తరాంధ్రలోని పార్వతీపురం జిల్లా బలజీపేట మండలం చిలకలపల్లిలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసిపి మాజీ ఎమ్మెల్యే జోగారావు సొంత గ్రామంలో ఆ పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. దీంతో టిడిపి నాయకులు పోలింగ్‌కి వెళ్లడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని టిడిపి కార్యకర్తలు అడ్డగించారు దీనితో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

విజయనగరం జిల్లా గరివిడి పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, జనసేన నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల నాయకులు పరస్పరం నెట్టుకొచ్చారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది. జనసేన నాయకురాలు పై వైసీపీ నేత దాడికి ప్రయత్నించారు. పోలింగ్ బూత్ వద్ద వైసిపి జెడ్పిటిసి అభ్యర్థి బొత్స పూజిత ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం విశేషం.

ముఖ్యమంత్రి చంద్రబాబు మూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నడు జరిగింది. టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి పళణి పై వైసిపి సానుభూతిపరుడు జయ కుమార్ రెడ్డి దాడి చేశాడు. టిడిపికి ఓటు వెయ్యొద్దంటూ పోలింగ్ కేంద్రానికి సమీపంలో జయకుమార్ ప్రచారం చేశాడు. అయితే టిడిపి అభ్యర్థి ప్రశ్నించడంతో అతనిపై దాడి చేశాడు. గాయపడిన టిడిపి ఎంపిటిసి అభ్యర్థిని కార్యకర్తలు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇక అన్నమయ్య ఏర్పాటు కె.వి పల్లె మండలంలో లక్కి రెడ్డి గారి పల్లెలో పోలింగ్ స్టేషన్కి దుండగులు ప్రవేశించారు. బ్యాలెట్ బాక్స్ ను బయటపడేశారు.

గుంటూరు పెద కాకాని జెడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ జిల్లా ఏజెంట్ పై వైసిపి ఏజెంట్లు బూతులు ప్రయోగించారు. ఈ పోలింగ్ కేంద్రం బయట రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది.

ఈ ఘటనకు ప్రధాన కారణం వైసిపి నాయకులు, కార్యకర్తలు అని పోలీసులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తున్న తమ బందోబస్తు నిర్వహిస్తున్న వైసిపి కార్యకర్తలు ఈ స్థాయిలో దాటిన వారికి పోలీసులు వివరిస్తున్నారు. నిజానికి ప్రజాస్వామ్యంలో దాడులకు ఆస్కారం ఉండకూడదు. స్వేచ్ఛాయుత విధానంలో ఎన్నికలు జరగాలి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును అదే స్థాయిలో వినియోగించుకోవాలి. అందుకు ప్రభుత్వాలు.. పోలీసులు తోడ్పాటు అందించాలి. కానీ వైసీపీ నాయకులు మాత్రం హింసే ఆయుధంగా దూసుకుపోతున్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు ద్వారా మాత్రమే అధికారంలోకి రావాలని వారు కలలుగంటున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ముందు నామినేషన్ల ప్రక్రియలో వైసిపి ఏ స్థాయిలో దాడులు జరిగాయి.. హింసకు పాల్పడింది అందరూ చూశారు. సాక్షాత్తు ఎంపీ మిధున్ రెడ్డి తన వాహనం ద్వారా టిడిపి కార్యకర్తలను తొక్కేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఏకంగా పులివెందులలో పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు.. ఇటువంటి నేపథ్యాలు ఉన్న వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారని.. ప్రజలకు అండగా ఎలా ఉంటారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird