
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్ల మీద రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ తెరకెక్కించిన చిత్రం ‘డానీ’. ఈ మూవీలో ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీ నవంబర్ 20న విడుదల చేయబోతోన్నట్టుగా స్పష్టంగా ఉంది. ఈ మేరకు సోమవారం నాడు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ.. ”కళ్యాణ్, నేను, రిజ్వాన్ కలిసి ‘నాటకం’ చేశాము. మళ్లీ ఇప్పుడు ‘డానీ’తో కలిశాం. ఇదొక కల్ట్ వైల్డ్ డ్రామా. ఇందులో రాకేందు గారి పాటలు, సాయి కార్తీక్ గారి మ్యూజిక్ గొప్పగా ఉంటుంది. ఆనంద్ అన్న అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సేజల్ అద్భుతమైన నటి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ జీగోగణ గారికి థాంక్స్. నవంబర్ 20న మా చిత్రం రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ మాట్లాడుతూ.. “నిర్మాత రిజ్వాన్, ఆశిష్, నేను కలిసి ‘నాటకం’ చేశాం. ఆశిష్ కెమెరా ముందు నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రిజ్వాన్ గారితో నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మా ఆడియో రైట్స్ తీసుకున్న కే మ్యూజిక్‌కి థాంక్స్. నవంబర్ 20న మా చిత్రం రాబోతోంది. అన్నారు.
.webp)
నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. “కళ్యాణ్ గారు, ఆశిష్ గారితో కలిసి నేను ‘నాటకం’ సినిమా నిర్మించాను. మళ్లీ ఇప్పుడు మేం ముగ్గురం కలిసి ‘డానీ’ చేశాం. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. గోవాలోనే ఎక్కువ భాగం చిత్రీకరించాం. మాకి మీడియా సపోర్ట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. నవంబర్ 20న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
రాకేందు మౌళి మాట్లాడుతూ.. “డానీ టైటిల్ సాంగ్ బాగుంటుంది. మొదటి సారి నేను ఆంగ్లంలో కూడా లిరిక్స్ రాశాను. ప్రేమలోని దశల్ని పట్టి ఇందులో డిఫరెంట్ సాంగ్స్ రాసే అవకాశం వచ్చింది. సాయి కార్తీక్ అద్భుతంగా బాణీలు ఇచ్చారు. ఇదొక డిఫరెంట్ చిత్రం. కళ్యాణ్‌తో నాకు ఇది ఆరో చిత్రం. సేజల్, ఆశిష్ అద్భుతంగా నటించారు. డానీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది.
ఏకే ఆనంద్ మాట్లాడుతూ.. “డానీ ప్రయాణంలో నాకు అందరూ సపోర్ట్ చేశారు. అందుకే విజువల్స్ అంత బాగా వచ్చాయి.” అన్నారు.
కె మ్యూజిక్ ప్రతినిధి ప్రియాంక మాట్లాడుతూ.. “మేం ‘డానీ’ చిత్రానికి సంబంధించిన పాటల్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. నవంబర్ 20న ఈ సినిమా విడుదలవుతోంది. అందరూ చూడండి.” అన్నారు.
నటి సేజల్ గుప్తా మాట్లాడుతూ.. “డానీ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఆశిష్ నాకు మంచి మిత్రుడయ్యాడు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి థాంక్స్” అన్నారు.
నటుడు అజర్ ఖాన్ మాట్లాడుతూ.. “డానీలో నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ అన్నకి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన ఆశిష్ గాంధీకి థాంక్స్.” అన్నారు.
