ఇంతకు ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫేస్‌లో ఎప్పుడూ సీరియస్ నెస్ లేకపోతే సైలెంట్ గా ఉంటాడు. గెలిచినా, ఓడినా ముఖం మీద చిరునవ్వు మాత్రం ఉండదు. ఎప్పుడో ఒకసారి చిరునవ్వు నవ్వుతాడు కానీ పూర్తి స్థాయిలో నవ్వడం ఎప్పుడూ చూసి ఉండరు. అయితే అసలు విషయానికి వస్తే గంభీర్ పగలబడి నవ్వినా వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తాజాగా బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియో ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. గంభీర్ ను నవ్వించిన ఆటగాడు ఎవరో కాదు.. మన ఉత్తమ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..
🗣️ 𝙇𝙚𝙩’𝙨 𝙨𝙝𝙤𝙬 🗣 𝘾𝙝𝙖𝙢𝙥𝙞𝙤𝙣𝙨
అభిషేక్ శర్మ ఆవేశపూరిత హడల్ స్పీచ్ టోన్ సెట్ చేసింది 🔥
క్లినికల్ విజయంతో #TeamIndia బ్యాకప్ చేసింది 💪
#NZvIND | @OfficialAbhi04 https://t.co/DAu4PDiUdw
— BCCI (@BCCI) అక్టోబర్ 23, 2026
ఇంతకుముందు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్‌తోనే కాదు.. పంజాబీ స్టైల్లో ఇచ్చిన స్పీచ్ జట్టులో ఫుల్ జోష్ నింపింది. న్యూజిలాండ్‌తో తొలి టీ20కి ముందు సహచరమని ఉద్దేశించి మాట్లాడిన అభిక్.. తనదైన పంచ్ డైలాగులతో నవ్వులు పూయించాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు టీం మేట్స్ అభిషేక్ ఫన్నీ స్పీచ్ కు తెగ నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-2తో డ్రా చేసుకున్న నేపథ్యంలో అభిషేక్ తన ప్రసంగంలో ఆ సిరీస్‌ను ప్రస్తావించాడు. గత మ్యాచ్‌ల్లో కొన్ని తప్పులు చేశామని అంగీకరిస్తున్నాను, న్యూజిలాండ్‌తో మాత్రం ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలని సూచించాడు. ప్రత్యర్థిని ఫ్రెండ్స్ లా భావించి ఆడటం కాకుండా, తమ సత్తా ఏమిటో మైదానంలో చూపించాలని పిలుపునిచ్చాడు.
“ఈ జట్టుతోనూ మేము అదే తరహాలో ఆడితే ప్రత్యర్థి మమ్మల్ని గట్టిగా సవాలు చేస్తున్నారు. ఆ తర్వాత తన పంజాబీ శైలిని జోడిస్తూ సంప్రదాయ ‘బోలి’ని వినిపించాడు. తనదైన యాసలో పద్యంలా చెప్పిన మాటలకు సహచరులు నవ్వులతో స్పందించారు. గంభీర్ సైతం చిరునవ్వులు చిందించడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో సరదా వాతావరణం ప్రదర్శించారు. గంభీర్ ఇంతలా నవ్వడం బహుశా ఇదే సారేమో అని ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.
