Home ఆంధ్రప్రదేశ్ YS Jagan Mohan Reddy: చెల్లి వాటాలో మేనకోడలు పెళ్లి చేసుకున్నారు – Andhra Waves

YS Jagan Mohan Reddy: చెల్లి వాటాలో మేనకోడలు పెళ్లి చేసుకున్నారు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: తోడబుట్టిన వాళ్లను ప్రేమగా చూసుకునే కల్చర్ మనదేశంలో అనాదిగా ఉంది. తోడబుట్టిన వాళ్ళ పిల్లలను మరింత ప్రేమగా చూసుకునే బాధ్యత మేనమామ మీద ఉంటుంది. మేనమామ అనేది కేవలం పిలుచుకునే వరుస కాదు. అది రక్త సంబంధాన్ని మించిన బంధం. ఆ బంధాన్ని కాపాడుకుంటే గొప్పగా ఉంటుంది. కానీ, మేనమామ అనే పదానికి వైసీపీ అధినేత జగన్ మాత్రం కొత్త అర్ధాన్ని చెబుతున్నారు. ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసిపిని నిలబెట్టింది షర్మిల. […]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: తోడబుట్టిన వాళ్లను ప్రేమగా చూసుకునే కల్చర్ మనదేశంలో అనాదిగా ఉంది. తోడబుట్టిన వాళ్ళ పిల్లలను మరింత ప్రేమగా చూసుకునే బాధ్యత మేనమామ మీద ఉంటుంది. మేనమామ అనేది కేవలం పిలుచుకునే వరుస కాదు. అది రక్త సంబంధాన్ని మించిన బంధం. ఆ బంధాన్ని కాపాడుకుంటే గొప్పగా ఉంటుంది. కానీ, మేనమామ అనే పదానికి వైసీపీ అధినేత జగన్ మాత్రం కొత్త అర్ధాన్ని చెబుతున్నారు.

ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసిపిని నిలబెట్టింది షర్మిల. ఇద్దరు చిన్న పిల్లల్ని వదిలిపెట్టి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసింది. ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ నిలబడింది. వైసీపీని బలోపేతం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లి చేసిన త్యాగం జగన్ కు పూచిక పుల్లగా మారిపోయింది. చివరికి చెప్పుడు మాటలు విని సొంత చెల్లిని దూరం పెట్టాడు. తండ్రి సంపాదించిన ఆస్తులు ఇవ్వబోనని.. ఇచ్చే అవకాశం కూడా లేదని మెడపట్టి బయటికి గెంటేశాడు. షర్మిల తన కుమారుడి పెళ్లి చేసుకుంటే కనీసం దానికి కూడా హాజరు కాలేదు. కనీసం యలహంక లో పెళ్లి జరగడానికి కూడా జగన్ కు మనసు ఒప్పడం లేదు.

ఒకప్పుడు బెంగళూరు యలహంక ప్యాలెస్ 20 విస్తీర్ణంతో ఉండేది. వైయస్ బతికున్నప్పుడు ప్యాలెస్ సందడిగా ఉండేది. రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడే ఎవరి వాటాలో వారు హాయిగా ఉండండి అంటూ ఆస్తులు కూడా పంచారు. కానీ, అదే ప్యాలెస్ ఇప్పుడు జగన్ అహంకారానికి.. తోడబుట్టిన సోదరి కన్నీటికి.. కన్నతల్లి నిర్వేదానికి సాక్షిగా మారింది.

నవంబర్ 25న షర్మిల కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. ఒకవైపు బెంగళూరులో డీకే శివకుమార్.. ఏఐసీసీ ఇన్ చార్జ్ టీవీ మోహన్ లాంటి ప్రముఖులను షర్మిల కలిశారు. సగర్వంగా పెళ్లి పత్రిక ఇచ్చారు. కానీ, తెర వెనుక మాత్రం షర్మిల.. ఆమె తల్లి విజయలక్ష్మి పడుతున్న నరకం మామూలుగా లేదు. అధికారం పోయిన తర్వాత.. కుర్చీ చేజారిపోయిన తర్వాత జగన్ గుండెలో కఠినత్వం ఏమాత్రం తగ్గలేదు. పైగా మేనకోడలు పెళ్లి అని కూడా ఆయన చూడడం లేదు.. అంజలి రెడ్డి పెళ్లి విషయంలో కూడా బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో ఉంటుంది.. అది కూడా ఆమె వాటాలోనే జరుపుకుంటోందని విజయలక్ష్మి కోరితే.. అసలు అలాంటి అవకాశం లేదని జగన్ స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంలో విజయలక్ష్మి పడుతున్న వేదన మామూలుగా లేదు. ఒకవైపు కొడుకు.. మరోవైపు కూతురు.. ఇద్దరు కూడా ఆమె పిల్లలు. తన మనవరాలి పెళ్లి విషయంలో జగన్ ఈ స్థాయిలో కక్షకట్టడాన్ని విజయలక్ష్మి తట్టుకోలేకపోతున్నారు. మౌనంగా రోదిస్తున్నప్పటికీ.. ఆమె రోదన జగన్ కు ఏ మాత్రం పట్టడం లేదు. అన్న చేస్తున్న పనికి షర్మిల రక్తం మరిగిపోతోంది. ఆయన అధికారం చేతిలో ఉంచలేకపోయారు సొంత సోదరుడిని ఇలా మానసికంగా వేధించడం జగన్ మనస్తత్వానికి అద్దం పడుతుందని టిడిపి నేతలు అంటున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird