Home Latest News అమెరికా విదేశాంగ కార్యదర్శి భారత్ పర్యటన: ఎందుకో తెలిస్తే షాకే.! | అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన | డీజిల్ సరఫరా సంక్షోభం | అమెరికా | US డొనాల్డ్ ట్రంప్ | ఇండియా US ఎనర్జీ రిలేషన్స్ | జామ్‌నగర్ రిఫైనరీ | US ఇంధన దిగుమతి – Andhra Waves

అమెరికా విదేశాంగ కార్యదర్శి భారత్ పర్యటన: ఎందుకో తెలిస్తే షాకే.! | అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన | డీజిల్ సరఫరా సంక్షోభం | అమెరికా | US డొనాల్డ్ ట్రంప్ | ఇండియా US ఎనర్జీ రిలేషన్స్ | జామ్‌నగర్ రిఫైనరీ | US ఇంధన దిగుమతి – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో, ఇంధన రంగంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తన అవసరాల కోసం ఏయే దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవాలో భారత్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తూ, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై వంద శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తూ అమెరికా తీరులో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అమెరికా స్వయంగా తన దేశంలో తలెత్తిన డీజిల్ సంక్షోభాన్ని అధిగమించడానికి భారత్ వైపు చూడాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్‌లో పర్యటిస్తున్నారు.

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తన పర్యటనలో భాగంగా సాధారణంగా దౌత్య చర్చలు జరిగేటప్పుడు కాకుండా ముంబై, గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ ప్రాంతాలను కూడా చుట్టేస్తున్నారు. నవంబరులో అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల సమయానికి దేశంలో డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చే అవకాశాలున్నాయి. భారత్ నుంచి భారీ స్థాయిలో డీజిల్ ఇంధన సరఫరాను రుబియో ఈ పర్యటన చేపట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

గతంలో రష్యా నుంచి చమురు దిగుమతులు తీసుకుంటున్న భారత్‌పై ఆంక్షలు, వందశాతం సుంకాల బెదిరింపులకు దిగిన అగ్రరాజ్యం, నేడు తన సొంత అవసరాల కోసం అదే భారత్ సహకారాన్ని కోరుతోంది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్లుగా అగ్రరాజ్యం తీరు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ ఇంధనంలో రిఫైనింగ్ సామర్థ్యంలో అగ్రగామిగా ఉన్న భారత్.. ఇప్పుడు అమెరికాకు ఆపద్బాంధవుడిగా మారుతున్న వైనం అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

అంతే కాకుండా ఏ దేశం నుంచైతే చమురు దిగుమతులు చేసుకుంటే వంద శాతం సుంకాలు విధిస్తామంటూ భారత్ ను హెచ్చరించిందో, ఇప్పుడు అదే రష్యాతో కూడా ఒప్పందం కుదుర్చుకుని ఆ దేశంపై ఆంక్షలను ఉపసంహరించుకోవడం ద్వారా అగ్రరాజ్యం తన అవసరాల కోసం ఎంతకైనా దిగివస్తానని మరోసారి రుజువు చేసుకుంది. స్వదేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, కొరత నుండి ట్రంప్ సర్కార్ అత్యవసరంగా భారత్ రిఫైనరీల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన ఒత్తిడి ఉంది.

ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త మలుపు తిప్పుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, వాస్తవిక ఆర్థిక, ఇంధన అవసరాలు అగ్రరాజ్యాన్ని అనివార్యంగా ప్రత్యమ్నాయ మార్గాల వైపు చూసేలా కనిపిస్తోంది. జామ్‌నగర్ వంటి అతిపెద్ద రిఫైనింగ్ కేంద్రాల ద్వారా అమెరికా తన ఇంధన భద్రతను కాపాడుకునేందుకు ప్రయత్నించుండటం భారత వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రపంచానికి మరోసారి చాటిచెబుతోంది.

[US Secretary of State Marco Rubio India Visit, Diesel Supply Crisis, America,  US Donald Trump, India US Energy Relations, Jamnagar Refinery, US Fuel Import, Telugu One]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird